Saturday, November 23, 2024
HomeTrending Newsత్వరలోనే తెలంగాణలో ఉద్యోగాల భర్తీ

త్వరలోనే తెలంగాణలో ఉద్యోగాల భర్తీ

Job Vacancies Balkasuman :

చౌకబారు ప్రచారం కోసం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ దొంగ దీక్షలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ విమర్శించారు.  కేంద్రం ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలో ఇచ్చిందో బండి చెప్పాలని నిలదీశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు చిల్లర రాజకీయలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో వేలాది ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని, పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటుందన్నారు. ఇప్పటికే 60 వేల ఖాళీలను గుర్తించామని, నోటిఫికేషన్లు విడతల వారిగా విడుదల చేస్తామన్నారు.
ప్రైవేట్ సెక్టార్‌లో 16 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. 35 ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మకానికి పెట్టింది మోడీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలేదని బిజెపి నాయకులను బాల్కసుమన్ అడిగారు. ఐటిఐఆర్‌ను కేంద్రం రద్దు చేస్తే తెలంగాణ బిజెపి నేతలు ఎందుకు మాట్లాడడంలేదని నిలదీశారు. కోల్ బ్లా

క్‌లకు వేలం వేస్తూ సింగరేణిని ప్రైవేటీకరించేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పించింది టిఆర్‌ఎస్ కాదా అని బండి సంజయ్ ను బాల్కసుమన్ అడిగారు. కేంద్రంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడంలేదని బిజెపి నేతలను నిరుద్యోగులు ఎక్కడికక్కడ నిలదీయాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రెండో కోట్ల ఉద్యోగలిస్తామని హామీ ఇచ్చారని ఏమైందని బాల్కసుమన్ ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో బండి సమాధానం చెప్పాలని అడిగారు. దేశంలో 8 శాతం నిరుద్యోగం ఉంటే తెలంగాణలో 4 శాతమే ఉందని ఎద్దేవా చేశారు

Also Read :  ఒక్కసారి అధికారం ఇవ్వండి: బండి

RELATED ARTICLES

Most Popular

న్యూస్