బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో హైదరాబాద్ కు చెందిన సిద్ధార్థ్ పితాని ని అరెస్టు చేశారు. హైదరాబాద్ ఈసిఐఎల్ లో అరెస్టు చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ముంబై తీసుకెళ్ళారు. సుశాంత్ ఆత్మహత్య కేసులో ఇదివరకే పలుసార్లు సిద్దార్థ్ ను సిబిఐ అధికారులు విచారించారు.
సుశాంత్ కు పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ గా పనిచేసిన సిద్దార్థ్ అతనితోనే కలిసి బాంద్రా ఫ్లాట్ లో మూడేళ్ళు కలిసి ఉన్నాడు. ఆత్మహత్యకు ముందు చివరిసారి సుశాంత్ అతనితో మాట్లాడినట్లు ఆధారాలు లభించాయి.
2020 జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ సుశాంత్ మృతిపై వెల్లువెత్తిన ఆరోపణల నేపథ్యంలో దీన్ని అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు పోలీసులు. ఆ తర్వాత కేసును సిబిఐకి అప్పగించారు.