Will you prove? రైతు సమస్యల ముగుసులో 317 జీవో అంశాన్ని పక్కదారి పట్టించేందుకు సిఎం కేసీయార్ ప్రయత్నిస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఎరువుల రేట్లపై ప్రధాని మోడీకి సిఎం కెసిఆర్ రాసిన లేఖపై బండి స్పందించారు. ఈ లేఖలో ప్రస్తావించిన విషయాల ఆధారంగా 11 ప్రశ్నలతో కూడిన ఓ బహిరంగ లేఖను బండి సంజయ్ కెసియార్ కు రాశారు. కెసియార్ లేఖ పచ్చి అబద్దాలతో, ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉందని మండిపడ్డారు. తాము 317పై ఉద్యమాలు చేస్తుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇలాంటి లేఖలతో కాలక్షేపం చేస్తున్నారన్నారు.
తెలంగాణాలో ఒక్క ఎకరానికైనా కరెంట్ మీటర్ పెట్టినట్లు నిరూపించగలరా అని బండి ప్రశ్నించారు. నిరూపించలేకపోతే కెసిఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఎరువులు ఇవ్వాలని, పండించిన పంటకు బోనస్ ఇవ్వాలని, క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని బండి సూచించారు.
Also Read : 317 జీవో సవరించాలి – బిజెపి