దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు పొడగిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 31 వరకూ పాఠశాలు మూసివేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. అయితే పండుగ కోసం ఈ నెల 8 నుంచి 16 వరకూ ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాల్టితో సెలవులు ముగుస్తుండటంతో ప్రభుత్వం తాజా ఉత్తర్వులు ఇచ్చింది.