రాష్ట్రంలో మరో పది రోజులపాటు లాక్ డౌన్ పొడిగిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే సడలింపు సమయాన్ని మూడు గంటలు పెంచింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ లాక్ డౌన్ కు సడలింపు ఇచ్చారు. ప్రజలు ఇళ్ళకు చేరుకునేందుకు మరో గంటపాటు వెసులుబాటు కల్పించారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకూ మాత్రం కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తారు. కరోనా నేపధ్యంలో తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు నిరాడంబరంగా నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది. క్యాబినెట్ నిర్ణయంతో జూన్ 9 వరకు లాక్ డౌన్ అమల్లో ఉండనుంది.
తెలంగాణాలో వ్యవసాయ పరిస్థితులు, లాక్ డౌన్ తదితర అంశాలపై చర్చిందేందుకు నేటి మధ్యాహ్నం 2 గంటలకు సిఎం కేసియార్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో రాష్ట క్యాబినెట్ సమావేశమైంది. ఖరీఫ్ సీజన్ కు విత్తనాల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధం, ధాన్యం సేకరణ అంశాలపై కూడా చర్చించింది.