Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్మూడో టి20లో విండీస్ విజయం

మూడో టి20లో విండీస్ విజయం

England Vs WI: ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టి20లో వెస్టిండీస్ 20 పరుగులతో విజయం సాధించింది. రోవ్ మ్యాన్ పావెల్ సెంచరీ (103)తో రాణించాడు. బార్బడోస్ , బ్రిడ్జి టౌన్ లో కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

విండీస్ ­11 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. బ్రాండన్ కింగ్ పది పరుగులు చేసి ఔటయ్యాడు, 48 వద్ద రెండో వికెట్ (షాయ్ హోప్ -4) కోల్పోయింది.  ఈ దశలో నికోలస్ పూరన్- పావెల్ లు మూడో వికెట్ కు 122  పరుగులు జోడించారు. పూరన్ 43బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 70; పావెల్ 53  బంతుల్లో  4  ఫోర్లు, 10 సిక్సర్లతో 107 పరుగులు చేసి ఔటయ్యారు. వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.  ఇంగ్లాండ్ బౌలర్లలో టోప్లె, జార్జ్ గార్టన్, మిల్స్, లివింగ్ స్టోన్, ఆదిల్ రషీద్ తలా ఒక వికెట్ సాధించారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ దూకుడుగానే ఆడినా త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది.  జట్టులో టామ్ బాంటన్-73 (39 బంతులు, 3 ఫోర్లు, 6 సిక్సర్లు) ఫిలిప్ సాల్ట్ -57 (24 బంతులు, 3 ఫోర్లు, 5 సిక్సర్లు) ధాటిగా ఆడినా ఫలితం లేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204  పరుగులు చేయగలిగింది. విండీస్ బౌలర్లలో రోమానియో షెఫర్డ్ మూడు, కీరాన్ పోలార్డ్ రెండు, షెల్డన్ కొట్రెల్, జాసన్ హోల్డర్, అకీల్ హోసేన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన పావెల్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

స్వదేశంలో ఇంగ్లాండ్ తో ఐదు టి 20లు, మూడు టెస్టులు వెస్టిండీస్ ఆడనుంది. మూడు టి 20 మ్యాచ్ లు పూర్తి కాగా విండీస్ 2-1 ఆధిక్యంతో కొనసాగుతోంది.

Also Read : రెండో టి-20లో ఇంగ్లాండ్ ఉత్కంఠ విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్