బీసీల ఆత్మబందువు,గా వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం నిలిపే విదంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బీసీ ఆత్మగౌరవ భవనాలకు సంబందించి ఏకసంఘంగా రిజిస్టరైన పది కులసంఘాలకు పిభ్రవరి 2వ తారీఖు బుదవారం పత్రాలను అందజేస్తున్నామన్నారు. దీనికి సంబందించి శనివారం పత్రికా ప్రకటన ద్వారా వివరాలు తెలియజేసారు. గత డిసెంబర్లో అన్ని కులసంఘాలతో సమావేశం నిర్వహించి బీసీ కులాల్లోని సంఘాలన్నీ ఆత్మగౌరవ భవనం కోసం ఏక సంఘంగా ఏర్పడి కామన్ రిజిస్టర్స్ ట్రస్ట్, అసోసియేషన్ గా ఏర్పడాలని సూచించామని, అలా ఏర్పడిన ఏకసంఘానికి ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం వారికే అనుమతులు ఇస్తామన్నామని మంత్రి తెలియజేసారు.
దానికి అనుగుణంగా పది బీసీ కులాలు, ఎల్లాపి, మేదరి, పెరిక, నకాస్, బసవేశ్వర లింగాయత్, రంగ్రేజ్ భవసార, అగర్వాల్ సమాజ్, నీలి, జాండ్ర, తెలంగాణ మరాట మండల్ ల్లోని కులాలకు చెందిన సంఘాలన్నీ కలిసి ఏక సంఘంగా ఏర్పడి ప్రభుత్వానికి తమ సమ్మతిని తెలియజేస్తూ సంబందిత పత్రాలను అందజేసారన్నారు. వారందరికీ పిభ్రవరి 2 వ తారీఖు, బుదవారం రోజున ఉదయం పదిగంటల నుండి ఒంటి గంట వరకూ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో అందజేస్తామని తెలియజేసారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని దాదాపు 5వేల కోట్ల విలువ చేసే 82 ఎకరాల స్థలాల్ని 41బీసీ కులాలకు ముఖ్యమంత్రి కేటాయించారని మంత్రి గంగుల వివరించారు. ఎకరాకు కోటి చొప్పున నిధుల్ని సైతం అందజేసి నిర్మాణాంలొ సైతం ఆయా కులాలకే పూర్తి అధికారాలతో అనుమతులు అందజేస్తున్నామన్నారు. వారి కులం ఆత్మగౌరవం ప్రతిఫలించేలా నిర్మాణం చేసుకోవాలని, వీటిపై నిరంతరం ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుందన్నారు మంత్రి గంగుల. మిగతా సంఘాలు సైతం త్వరలోనే నిర్ణయం తీసుకోని ఏక సంఘగా ఏర్పడి ఆత్మగౌరవ భవనాల్ని త్వరగా నిర్మించుకోవాలని ఈ సందర్బంగా మంత్రి పిలుపునిచ్చారు.