Sunday, January 19, 2025
Homeసినిమాదర్శకుడికి కోటి విలువైన కారు బహమతిగా ఇచ్చిన నిర్మాత

దర్శకుడికి కోటి విలువైన కారు బహమతిగా ఇచ్చిన నిర్మాత

Costly Gift: మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం ‘ఖిలాడి’. ఈ చిత్రంలో ర‌వితేజ స‌ర‌స‌న డింపుల్ హ‌య‌తి, మీనాక్షి చౌద‌రి న‌టించారు. ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రానికి రమేష్‌ వర్మ దర్శకత్వం వ‌హిస్తున్నారు. ‘రాక్షసుడు’తో స‌క్స‌స్ సాధించిన ర‌మేష్ వ‌ర్మ ఈ సినిమాతో తన సత్తా మరింతగా చాటాలని ప‌ట్టుద‌ల‌తో వ‌ర్క్ చేశారు. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ అండ్ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తుండ‌డంతో సినిమా పై పాజిటివ్ టాక్ ఉంది.

ఈ చిత్రం ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. ఈ చిత్ర నిర్మాత కోనేరు సత్యనారాయణ దర్శకుడు రమేష్ వర్మకు ఎంతో విలువైన కానుక ఇవ్వడం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. రమేష్‌ వర్మ రూ.1.15 కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్ కారును బహూకరించారు. అయితే.. స‌హ‌జంగా సినిమా సక్సెస్ అయిన త‌ర్వాత ఇలా గిఫ్టులు ఇస్తుంటారు కానీ.. ఖిలాడి సినిమా ఖ‌చ్చితంగా హిట్ అవుతుందన్న న‌మ్మ‌కంతో నిర్మాత అంత విలువైన బహుమతిని సినిమా విడుద‌ల‌కు ముందుగానే ఇవ్వ‌డం విశేషం.

Also Read : ర‌వితేజ ‘ఖిలాడి’కి ఫ్యాన్సీ ప్రీ రిలీజ్ బిజినెస్

RELATED ARTICLES

Most Popular

న్యూస్