We only Alternative: రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయంగా ప్రజలు చూస్తున్నారని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కడప పేరు మార్చి వైయస్సార్ జిల్లా అని పెట్టారని అలాంటప్పుడు గుంటూరులో జిన్నా రవార్ పేరు తీసి అబ్దుల్ కలాం పేరు పెడితే అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. జిన్నా పేరును తొలగించాలని, లేకపోతే తాము అధికారంలోకి రాగానే మారుస్తామని స్పష్టం చేశారు. విజయవాడలోని రాష్ట్ర బిజెఇ కార్యాలయంలో వీర్రాజు మీడియాతో మాట్లాడారు.
మీడియా సమావేశంలో ముఖ్యాంశాలు:
⦿ ఉద్యోగులు హక్కుల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు
⦿ ప్రభుత్వం వారిని నిర్భంధించే చర్యలు మానుకోవాలి
⦿ ముందస్తు నోటీసులు ఇచ్చి అడ్డుకోవడం కరెక్ట్ కాదు
⦿ ఉద్యోగ సంఘాలను నిర్భందించడం అంటే జగన్ తనను తానే నిర్భందించుకున్నట్లు
⦿ ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య మాటల యుద్దం మంచిది కాదు
⦿ ఈ ప్రభుత్వం వద్ద డబ్బు లేదు… అప్పుల కోసం తిప్పలు పడే పరిస్థితి
⦿ మూల ధనం పెంచుకోవడం పై జగన్ దృష్టి సారించాలి
⦿ ఆదాయం పెంచుకునేందుకు ఈ ప్రభుత్వం వద్ద అజెండా లేదు
⦿ ఇసుక ధర విషయంలో ప్రభుత్వం లెక్కలు అర్ధం కాకుండా ఉన్నాయి
⦿ ఇసుక రూపంలోనే ఐదు వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది
⦿ వేల కోట్ల రూపాయల విలువ చేసే గనులు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నాయి
⦿ ఎర్ర చందనం అమ్మకం తో మూడు వేల కోట్ల అదాయం వస్తుంది
⦿ కానీ ఇవన్నీ రాజకీయ కోణంలో దోచుకోవడమే తప్ప… ప్రభుత్వానికి చేరడం లేదు
⦿ చీమకుర్తి గనులు గతంలో ఎవరి ఆధీనంలొ ఉండేవి.. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి
⦿ జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే ఆదాయాన్ని పెంచాలి
⦿ మోడీ నలభై లక్షల కోట్ల ఆదాయం పెంచారు
⦿ 2వేల కిలోమీటర్ల రోడ్ నిర్మాణానికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలి
⦿ పెన్నా, కృష్ణా, గోదావరి నదుక అనుంధానం వల్ల వేల కోట్ల ఆదాయం వస్తుంది
⦿ ఎంఎస్ఎంఈ ద్వారా పధకాలు తెస్తే ఆదాయం వచ్చే అవకాశం ఉంది
⦿ కొండ ప్రాంతాల అభివృద్ధి పేరుతో పర్వత మాల్ పెట్టారు
⦿ సాగర్ మాల్ తరహాలో.. పర్వత మాల్ రోప్ వే ఏర్పాటు చేయాలి
⦿ అనేక ప్రాంతాలు పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందుతాయి
⦿ పార్కుల అభివృద్ధి, చిరు ధాన్యాల ఉత్పత్తి పై దృష్టి పెట్టాలి
⦿ ప్రతి గ్రామంలో ఆహార శుద్ధి పరిశ్రమ పెట్టే అవకాశం ఉంది
⦿ విశాఖ, కాకినాడల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు పెట్టాలి
⦿ సేంద్రియ వ్యవసాయాన్ని కేందం ప్రోత్సహిస్తుంది
⦿ ఈ ప్రభుత్వానికి కేంద్రం ఇరవై లక్షల ఇళ్లు కేటాయించారు
⦿ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తరహాలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేశారు
⦿ పోలవరం విషయంలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు
⦿ ప్రాజెక్టు కు ఖర్చు పెడితే మేము నిధులు ఆపామా?
⦿ ప్రత్యేక హోదా కాదు.. స్పెషల్ ప్యాకేజీ కి చంద్రబాబు అంగీకరించారు
⦿ ఈ ప్యాకేజీ పై అడిగి నిధులు ఎందుకు తెచ్చుకోవడం లేదు?
⦿ రైల్వే జోన్ విషయంలో ఎపీకి తప్పకుండా న్యాయం జరుగుతుంది
⦿ స్టీల్ ప్లాంట్ కు 930 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టాం
⦿ కడప లో మూడు షుగర్ ఫ్యాక్టరీ లను జగన్ మూసివేశారు
⦿ హంద్రీనీవా, గాలేరు వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి