జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ గా సుప్రిమ్ కోర్ట్ మాజీ న్యాయమూర్తి అరుణ్ కుమార్ మిశ్రా నియామకం. ఢిల్లీ లో ఈ రోజు ఎన్.హెచ్.ఆర్.సి చైర్మెన్ గా అరుణ్ కుమార్ మిశ్రా భాద్యతలు స్వీకరించనున్నారు. 2014 నుంచి సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిగా విధులు నిర్వహించి గత ఏడాది పదవి విరమణ చేశారు.
మధ్యప్రదేశ్ హైకోర్టులో న్య్యాయముర్తిగా ప్రస్థానం ప్రారంభించిన అరుణ్ కుమార్ మిశ్రా కలకత్తా హైకోర్టు , రాజస్థాన్ హైకోర్టుల్లో ప్రధాన న్యాయముర్తిగా విధులు నిర్వహించారు.
మే 31 వ తేదిన ప్రధానమంత్రి నరేంద్రమోడి అధ్యక్షతన జరిగిన కమిటి సమావేశంలో మిశ్రా ఎంపిక జరిగింది. కమిటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ రాయి బచ్చన్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా , రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే సబ్యులుగా ఉన్నారు.
అరుణ్ కుమార్ నియామకం పై విమర్శలు
గత ఏడాది ఫిబ్రవరీలో ఢిల్లీ లో జరిగిన ఒక అంతర్జాతీయ కాన్ఫరెన్స్ లో ప్రధానమంత్రి ని పొగుడుతూ అరుణ్ కుమార్ మిశ్ర ప్రసంగం చేయటం అప్పట్లో వివాదం అయింది. నరేంద్ర మోడీ అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన దార్శనికుడని (“ internationally acclaimed visionary who could think globally and act locally “ ) అరుణ్ కుమార్ మిశ్రా పొగిడారు. ఉన్నతమైన స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఏమిటనే విమర్శలు వచ్చాయి.
సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన వారిని జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ గా నియమించటం ఆనవాయితి. ప్రధాన న్యాయమూర్తిగా చేసినవారికి కాకుండా న్యాయమూర్తిగా భాద్యతలు నిర్వహించినవారికి చైర్మెన్ పదవి ఇవ్వటం 27 ఏళ్ల ఎన్.హెచ్.ఆర్.సి చరిత్రలోమొదటిసారి జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి.
మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్య సభలో ప్రతి పక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే అరుణ్ కుమార్ మిశ్రా నియామకం పై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. దళిత, బహుజన, మైనారిటీలకు సంబందించిన ఫిర్యాదులు మానవ హక్కుల కమిషన్ ఎక్కువగా వస్తాయని, ఆ వర్గాల నుంచి చైర్మెన్ పదవికి ఎంపిక చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. వారం రోజుల్లో మరోసారి సమావేశం ఏర్పాటు చేసి నిమ్న వర్గాల నుంచి చైర్మెన్ ను తీసుకోవాలని ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి లేఖ రాశారు.