Saturday, November 23, 2024
HomeTrending Newsజూన్ నాటికి సంస్కరణల అమలు : సిఎం జగన్

జూన్ నాటికి సంస్కరణల అమలు : సిఎం జగన్

Reforms in Education: వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యే జూన్‌ నాటికి నూతన విద్యావిధానానికి అనుగుణంగా అన్ని సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు.  విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో టీచర్లు ఉండాలని,  సబ్జెక్టుల వారీగా టీచర్లు కూడా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. నూతన విద్యావిధానంలో ఏర్పాటవుతున్న స్కూల్స్‌ కారణంగా సుమారు 22 వేలమందికి పైగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు వస్తాయని వెల్లడించారు. పాఠశాల విద్యాశాఖపై తాదేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఎం జగన్ అధికారులకు చేసిన సూచనలు:

⦿ ప్రతి మండలానికి ఒక హైస్కూల్‌ను జూనియర్‌ కాలేజీగా తీర్చిదిద్దుదామని అనుకున్నాం
⦿ ఇప్పుడు ప్రతి మండలానికి రెండు స్కూళ్లను 2 జూనియర్‌ కాలేజీలుగా మార్చండి
⦿ ఒకటి కో-ఎడ్యుకేషన్‌ కోసం అయితే, ఒకటి బాలికలకోసం
⦿ ఎస్‌ఈఆర్‌టీ ఇచ్చిన సిఫార్సులు అన్నీకూడా అమల్లోకి రావాలి
⦿ మండల రీసోర్స్‌ సెంటర్‌ పేరును మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంగా మార్చండి
⦿ ఎండీఓ పరిధిలో కాకుండా ఎంఈవోకే నేరుగా డ్రాయింగ్‌ అధికారాలు ఇవ్వాలి
⦿ ఇకపై విద్యాసంబంధిత కార్యకలాపాలు ఎంఈవోకే అప్పగిస్తూ ఎస్‌ఈఆర్‌టీ సిఫార్సుకు సీఎం ఆమోదం
⦿ ఎంఈఓ పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌
⦿ పలురకాల యాప్స్‌ కన్నా, రియల్‌ టైమ్ డేటా ఉండేలా, డూప్లికేషన్‌ లేకుండా చూడాలన్న ఎస్‌ఈఆర్‌టీ సిఫార్సును అమల్లోకి తీసుకురావాలి
⦿ ఎస్‌ఈఆర్‌టీ సూచనల ప్రకారం అటెండెన్స్‌ ను ఫిజికల్‌గా కాకుండా ఆన్‌లైన్‌ పద్ధతుల్లో తీసుకోవాలి, విద్యార్ధుల మార్కులనూ ఆన్‌లైన్‌లో ఎంట్రీచేయాలి
⦿ పాఠాలు బోధించే ఉపాధ్యాయులకు నాన్‌ అకడమిక్‌ పనులకు వినియోగించవద్దని, హెడ్‌మాస్టర్లను పలు రకాల మీటింగులు కాకుండా సమన్వయంకోసం నెలకు ఒకే సమావేశం ఏర్పాటు చేయాలన్న ఎస్‌ఈఆర్‌టీసూచనలకు సిఎం ఆమోదం


⦿ స్కూళ్ల నుంచి ఫిర్యాదుల పరిష్కారంపై వెంటనే చర్యలు తీసుకోవాలి
⦿ సదుపాయాల లేమి, మౌలిక వసతుల మరమ్మతులు తదితర అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి
⦿ నాడు నేడులో ఏర్పాటుచేసిన ఏ సదుపాయాల్లో ఎలాంటి సమస్యవచ్చినా వెంటనే చర్యలు తీసుకోవాలి
⦿ స్కూళ్ల నిర్వహణ, టాయిలెట్స్, తాగునీరు వీటి నిర్వహణపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
⦿ ప్రభుత్వ పాఠశాలల్లో నాడు – నేడు రెండో విడత పనులు మొదలుపెట్టాలి
⦿ స్కూళ్ల నిర్వహణలో సమస్యలపై ఫిర్యాదులకు ఏర్పాటు చేసిన 14417 టోల్‌ ఫ్రీ నంబర్‌ సమర్థవంతంగా పనిచేయాలి
⦿ డిజిటల్‌ లెర్నింగ్‌పైనా కూడా దృష్టిపెట్టాలి
⦿ 8,9,10  తరగతుల్లో డిజిటల్‌ లెర్నింగ్‌ ఉండేలా చూడాలి
⦿ దీన్నొక సబ్జెక్టుగా కూడా పెట్టే ఆలోచన చేయాలి

ఈ సమీక్షా సమావేశంలో పాఠశాల విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, మహిళా,శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్