TRS Privilege : తెలంగాణ ఏర్పాటుపై ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టిఆర్ఎస్ ఆందోళన ఉధృతం చేసింది. రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ ఏర్పాటు అంశంపై చేసిన వ్యాఖ్యలపై ప్రివిలేజ్ మోషన్‌ను ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు ప్రివిలేజ్ మోషన్‌ను సమర్పించిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కేకే, ఎంపీలు సంతోష్ కుమార్, సురేశ్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్. ప్రధానమంత్రి వ్యాఖ్యలతో తెలంగాణ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలని తెరాస, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పట్ల చేసిన వ్యాఖ్యలతో పార్లమెంటరీ వ్యవస్థను, ఎంపిలను కూడా అవమానించారని తెరాస నేతలు విమర్శించారు. ప్రధాని వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు రాజ్యసభ సమావేశాలను తెరాస బహిష్కరించింది. కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్షాలు కూడా టిఆర్ఎస్ వాదనతో ఏకీభవించి చాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖార్గే కూడా టిఆర్ఎస్ కు మద్దతు పలికారు.
రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి తీరుపై మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాన చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు… అదేవిధంగా ఎనిమిదేళ్ల తర్వాత కూడా ప్రధాని మీడియా సమావేశాలు నిర్వహించకుండా, మీడియాకు ఇచ్చే ఇంటర్వ్యూలపైనే ఆధారపడాల్సి రావడం సిగ్గుచేటని విమర్శించారు.
ఇవి కూడా చదవండి: ప్రధాని వ్యాఖ్యలపై భగ్గుమన్న గులాబి దండు