Monday, April 21, 2025
Homeస్పోర్ట్స్లివింగ్ స్టోన్, టిమ్ డేవిడ్ లకు భారీ ధర

లివింగ్ స్టోన్, టిమ్ డేవిడ్ లకు భారీ ధర

IPL Auction: ఐపీఎల్ వేలం నేడు రెండోరోజు కూడా కొనసాగుతోంది. ఇంగ్లాండ్ ఆటగాడు లియాం లివింగ్ స్టోన్ 11.50 కోట్ల రూపాయలకు పంజాబ్ కింగ్స్ లెవెన్ కొనుగోలు చేసింది. వెస్టిండీస్ ఆటగాడు ఓడియన్ స్మిత్ ను కూడా పంజాబ్ ఆరు కోట్ల రూపాయలకు చేజిక్కించుకుంది.

సింగపూర్ ఆటగాడు టిమ్ డేవిడ్ ను రూ. 8.25 కోట్లకు, సౌతాఫ్రికా ఆటగాడు జోఫ్రా ఆర్చర్ ను రూ.8 కోట్లకు, డానియెల్ శామ్స్ ను 2.60 కోట్ల రూపాయలకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది.

అండర్ 19 వరల్డ్ కప్ లో ప్రతిభ చూపిన కెప్టెన్ యష్ దయాళ్ ను రూ.3.20 కోట్లకు, విండీస్ ఆటగాడు అల్జార్రి జోసెఫ్ ను రూ. 2.4 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది.

వెస్టిండీస్ ఆల్ రౌండర్ రోమానియో షెఫర్డ్ ను 7.75 కోట్ల రూపాయలకు, ఆస్ట్రేలియా  క్రికెటర్ సియాన్ అబ్బాట్  రూ. 2.4 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్