Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్హాకీ: సౌతాఫ్రికాపై ఇండియా రెండో విజయం

హాకీ: సౌతాఫ్రికాపై ఇండియా రెండో విజయం

India Beat SA: సౌతాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్ లో కూడా 10-2 గోల్స్ తేడాతో ఇండియా విజయం సాధించింది. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పురుషుల ఎఫ్.ఐ.హెచ్. ప్రో లీగ్ 2021-22 లో భాగంగా నేడు ఇండియా-సౌతాఫ్రికా మధ్య రెండవ మ్యాచ్ జరిగింది. ఈనెల 9వ తేదీన జరిగిన మొదటి మ్యాచ్ లో కూడా ఇదే స్కోరు 10-2 తేడాతో ఇండియా గెలవడం విశేషం. నిన్న శనివారం ఫ్రాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా 5-2 తేడాతో ఓటమి పాలైన ఇండియా దాని నుంచి తేరుకుని నేడు మరో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

సౌతాఫ్రికాలోని యూనివర్సిటీ అఫ్ నార్త్ వెస్ట్ పోట్చెఫ్ స్ట్రామ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆట 12వ నిమిషంలో సౌతాఫ్రికా మొదటి గోల్ తో బోణీ చేసింది. 15వ నిమిషంలో ఇండియా ఆటగాడు సురేందర్ కుమార్ గోల్ సాధించి స్కోరు సమం చేశాడు. 27,28 నిమిషాల్లో ఇండియా మరోరెండు గోల్స్ సాధించింది. ద్వితీయార్ధం మొదలైన కాసేపటికి హర్మన్ ప్రీత్ సింగ్ మరో గోల్ సాధించాడు. 45 వ నిమిషంలో సుమిత్ మరో గోల్ సాధించి ఇండియా ఆధిక్యాన్ని 1-5కు చేర్చాడు.

ఆట చివరి పావు భాగంలో 48, 52,  56 నిమిషాల్లో మరో మూడు గోల్స్ చేసిన ఇండియా చివరి 60వ నిమిషంలో ఒకేసారి రెండు గోల్స్ చేసి 10 గోల్స్ మార్క్ ను అందుకుంది. సౌతాఫ్రికా 53న నిమిషంలో రెండో గోల్ సాధించడంతో ఇండియా 10-2 తేడాతో విజయం సొంతం చేసుకుంది.

ఇండియా సాధించిన 10 గోల్స్ లో 6 ఫీల్డ్ గోల్స్, 4 పెనాల్టీ కార్నర్ గోల్స్ ఉన్నాయి. సౌతాఫ్రికా సాధించిన రెండు గోల్స్ పెనాల్టీ కార్నర్ ద్వారా లభించాయి.

Also Read : హాకీ: సౌతాఫ్రికాను చిత్తు చేసిన ఇండియా

RELATED ARTICLES

Most Popular

న్యూస్