కోట్లాది మంది భక్తుల ఇలవేలుపు సమ్మక్క తల్లి గురువారం రాత్రి 09:20 ని.లకు గద్దెపైన కొలువుతీరింది. ప్రభుత్వ లాంచనాలతో సమ్మక్కను మేడారం గద్దెపైకి పూజారులు, అధికారులు తీసుకువచ్చారు. అంతకుముందు ఈ మేరకు గిరిజన పూజారులు, అధికారులు విసృత ఏర్పాట్లు చేశారు.
జిల్లా ఎస్సి సంగ్రామ్ సింగ్జీ పాటిల్ గాలిలోకి కాల్పులు జరిపి సమ్మక్కను ఆహ్వానించగా, జిల్లా కలెక్టర్ క్రిష్ణా అధిత్యా దగ్గరుండి చిలకలగుట్ట నుండి సమ్మక్క గద్దె వరకు వెంటవచ్చారు.
చిలుకలగుట్ట నుంచి సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కిష్టయ్య గద్దెమీద ప్రతిష్టించే ముందు పూజా తంతును ఇతరులు చూడకుండా ఉండేందుకు లైట్లను బంద్ చేసి, పున్నమి వెలుగుల్లో తల్లిని గద్దెపై కొలువు దీర్చారు. దీంతో జాతర పతాకస్థాయికి చేరుకుంది.
రాష్ట్ర పంచాయితిరాజ్ శాఖ మంత్రి వర్యులు ఎర్పబెల్లి దయాకర్ రావు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గోన్ని అమ్మవార్ల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్బంగా అమ్మ వార్లు గద్దే ఎక్కేందుకు కృషిచేసిన ప్రతి ఒక్క శాఖాధికారికి, ఇతరలకు మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. అమ్మవార్ల దర్శన సమయంలో భక్తులు సంయమనం పాటిస్తూ నిదానంగా అమ్మవార్లను దర్శించుకోవాలని కోరారు.
Also Read : మేడారం జాతరకు పోటెత్తిన జనం