ఆయిల్ ఫామ్ పంట సాగుకు తెలంగాణ భూములు అనుకూలమని… రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించి అధిక దిగుబడులు పొందాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు… పంటల మార్పిడి తో రైతులు అధిక దిగుబడులు పొందవచ్చని … ఆయిల్ ఫామ్ పంటకు దాదాపు మన రాష్ట్రంలోని అన్ని రకాల నేలలు అనుకూలం అని అన్నారు, రాష్ట్రంలో ఏడాదికి దాదాపుగా 90 వేల కోట్ల విలువగల నూనె ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నామని మంత్రి తెలిపారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి వర్యులు గంగుల కమలాకర్ పేర్కొన్నారు నేడు శనివారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో లోహియా ఎడిబుల్ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు ఆయిల్ ఫామ్ పంట సాగు పై నిర్వహించిన అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి గంగుల కమలాకర్ హాజరైనారు.
ఒక ఎకరం భూమి లో 57 ఆయిల్ ఫామ్ మొక్కలు నాటవచ్చునని పేర్కొన్నారు.. ఆయిల్ ఫామ్ తోటలో మొక్కల మధ్య దూరం ఎక్కువ కనుక తొలి 3 సంవత్సరాలు అంతర్ పంటలు వేసుకొని అధిక లాభాలు పొందవచ్చునని, అంతర్ పంటగా కోకోవా తో పాటు మొక్కజొన్న , అరటి , పొద్దుతిరుగుడు , మిరప సోయాబీన్స్, పసుపు ,పూలు , పెసలు మినుము, అలసందలు , నువ్వులు వేరుశనగ ,కూరగాయ పంటలు వేసుకోవచ్చు అని పేర్కొన్నారు.. ఆయిల్ ఫామ్ ఎక్కువ దిగుబడికి సమృద్ధిగా నీరు అవసరమని మంత్రి తెలిపారు, గౌరవ ముఖ్యమంత్రిగారు తెచ్చిన కాలేశ్వరంతో వేసవి కాలంలో సైతం పుష్కలంగా నీరు లబిస్తుందని, బోరుబావుల కింద సాగు చేయవచ్చునని ఒక్కో మొక్కకు సుమారు రెండు వందల లీటర్ల నీళ్లు అవసరమని తెలిపారు.
ఆయిల్ ఫామ్ సాగుచేసే రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 90 శాతం సబ్సిడీతో డ్రిప్స్ సదుపాయం కలిగిస్తుందని తెలిపారు రైతులంతా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఆయిల్ ఫామ్ చెట్టు 14- 18 నెలల వరకు పూతకు వస్తుందని , దాదాపు 4,సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఆదాయం ఉంటుందని పేర్కొన్నారు.. ఆయిల్ ఫామ్ పంటతో ఒక్కో సంవత్సరం 80నుండి 90 వేల వరకు ఆదాయం వస్తుందని మంత్రి తెలిపారు.. రైతులంతా వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ పంటలు సాగు చేయడం వలన క్రిమికీటకాల బెడదతో పాటు కోతుల నుండి కూడా రక్షించుకోవచ్చు అని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే వొడితెల సతీష్, ఆయిల్ ఫామ్ కంపెనీ ప్రతినిధులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.