Caste Wise Census :
బీహార్ లో కులాల వారిగా జనాభా లెక్కలు చేపడుతామని, రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో నిర్వహిస్తామని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. ఇందుకోసం అందరి అభిప్రాయం తెలుసుకునేందుకు అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. కులాల వారిగా జనాభా గణన రాష్ట్రభివ్రుద్దికి తోడ్పడుతుందని ఈ రోజు పాట్నాలో వెల్లడించారు. దీనివల్ల ఆయా కులాల్లో వెనుకబడిన వర్గాల అభివృద్దికి నిర్దుష్టమైన ప్రణాలికలు రుపొందిన్చావచ్చని నితీష్ పేర్కొన్నారు.
దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు గడిచినా కొన్ని కులాల వారికీ అభివృద్ధి ఫలాలు అందటం లేదని, కులాల వారిగా జనాభా గణన చేపడితే వారి ఉన్నతికి చర్యలు చేపట్టవచ్చన్నారు. బడ్జెట్ లో నిధుల కేటాయింపు దగ్గర నుంచి విద్య, ఉపాధి తదితర మౌలిక సదుపాయాలు కల్పించటంలో కులాల వారి జనాభా లెక్కలు అక్కరకు వస్తాయని నితీష్ కుమార్ వివరించారు.
రాజకీయ వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ ను కలవతంలో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవని నితీష్ కుమార్ స్పష్ టం చేశారు. ఇటీవలి ఢిల్లీ పర్యటనలో నితీష్ కుమార్ తో ప్రశాంత్ కిషోర్ సమావేశమయ్యారు. తన ఆరోగ్యం బాగోలేన్దందున పలకరించేందుకు ప్రశాంత్ కిషోర్ వచ్చారని తెలిపారు.
నితీష్ ప్రభుత్వం జనాభా లెక్కలు కులాల వారిగా చేపడితే దేశంలో ఈ విధంగా చేసిన మొదటి రాష్ట్రం అవుతుంది. క్రమంగా అన్ని రాష్ట్రాలు నితీష్ దారిలో నడవాల్సిన పరిస్థితి వస్తుంది. తమ పార్టీ అధికారంలోకి వస్తే కులాల వారిగా జనాభా గణన చేపట్టి తీరుతామని అఖిలేష్ యాదవ్ ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందే ప్రకటించారు.