problems for Farmers: రాష్ట్రంలో రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీకాకుళం ఎంపీ, తెలుగుదేశం పార్టీ నేత కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. ధాన్యం కొలుగోళ్ళపై శ్రద్ధ చూపడంలేదని, కొనుగోలు చేసిన ధాన్యానికి నిర్ణీత వ్యవధిలో డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరుగుతోందని, రైతు కళ్ళ నుంచి కన్నీరు కాకుండా రక్తం కారే పరిస్థితి నెలకొని ఉందని అయన వెల్లడించారు. ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న రైతు భరోసా కేంద్రాలు వైసీపీ కార్యాలయాలుగా మారిపోయాయని, అన్నదాతల సమస్యలపై టిడిపి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
నేడు తన తండ్రి ఎర్రన్నాయుడు 65వ జయంతి సందర్భంగా రామ్మోహన్ నాయుడు ఘనంగా నివాళులర్పించారు. “ఉత్తరాంధ్రలోనే కాదు దేశ రాజకీయాల్లోనూ నాన్నగారు తనదైన ముద్ర వేశారు. రాష్ట్ర ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం జరిపారు. ఎల్లప్పుడూ ప్రజాక్షేమాన్ని కాంక్షించే నాన్న గారు ప్రజలు కోసం,TDP కోసం అంకితభావంతో పనిచేశారు. ఈరోజు వారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను” అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
Also Read : జగన్ పై మోజు తగ్గింది: రామ్మోహన్