Take on TDP: వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి వరుస ట్వీట్లతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై విమర్శల దాడి చేశారు. నిన్న ఆత్మకూరు, టిడిపి కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ల అవగాహనా సదస్సులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విజయసాయి స్పందించారు.
“చంద్రబాబు గారు…. సర్పంచుల సదస్సు పెట్టింది ప్రభుత్వాన్ని ఎలా బ్లాక్ మెయిల్ చేయొచ్చో నేర్పించడానికా? మీ హయాంలో ఉపాధి హమీ పనుల దోపిడీ వివరాలు కేంద్రం దగ్గర ఉన్నాయి. దొంగే దొంగ అని అరవడం కొత్తకాదు గదా మీకు. ‘నరేగా’లో 7 వేల కోట్ల అవినీతి జరిగితే ఫిర్యాదు చేయకుండా ఎవరు ఆపారు మిమ్మల్ని” అంటూ ప్రశ్నించారు.
మీడియాపై కూడా విజయసాయి మండిపడ్డారు. “చంద్రబాబు సుపారీ మీడియా ఏ స్థాయికి దిగజారిందంటే జగన్ గారి అజాగ్రత్త వల్ల బంగాళాఖాతం వంద కిలోమీటర్లు ముందుకొచ్చిందని ప్రచారం చేసినా చేస్తారు. విలువలు, వాస్తవాలతో సంబంధం లేని బతుకులయ్యాయి. ప్రజలు విజ్ఞులు. పచ్చ బ్యాచ్ నీచపు కుతంత్రాలను పసిగడుతూనే ఉన్నారు” అంటూ ట్వీట్ చేశారు.
Also Read : కాగ్ ప్రశ్నలకు బదులేది?