తెలంగాణలో ఎవరెన్ని యాత్రలు చేసినా ఫలితం శూన్యమని, పాదయాత్రలు చేసినా,మోకాలి యాత్రలు చేసినా అవి కాశీ యాత్రలే అవుతాయని మంత్రి జగదీష్ రెడ్డి వ్యంగ్యంగా విమర్శించారు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల యాత్రలు ఢిల్లీ వైపే అన్నారు. బండి సంజయ్ పాదయాత్ర పై విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వ్యంగాస్త్రాలు విసిరారు.మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యపేట జిల్లా పిల్లలమర్రి గ్రామంలోనీ రుద్రేశ్వరలయంలో మంత్రి జగదీష్ రెడ్డి సునీత దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బిజెపి నేత బండి సంజయ్ పై విసుర్లు విసిరారు. ఢిల్లీ కోట నుండి బిజెపిని దించాలి అన్నదే దేశంలో చర్చ జరుగుతోందని, మోడీ సర్కార్ ను దించాలి అన్నది దేశప్రజల నిర్ణయమని మంత్రి అన్నారు.
ప్రజల ఆ నిర్ణయాన్ని సాకారం చేయాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని మంత్రి జగదేశ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు అన్నీ తెలుసునని 2014 కు ముందు వెనుక అన్నదే ప్రజల్లో చర్చ జరుగుతుందన్నారు. ఎనిమిదేండ్లలో జరిగిన అభివృద్ధి ఏమిటీ అన్నది ప్రజలు గమనిస్తున్నారని, బండి సంజయ్ లాంటి వారిని ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదన్నారు. పాదయాత్ర చేసినా ఆయన ప్రజలకు చెప్పేది ఏమి ఉండదని, గుజరాత్ లో 25 ఏండ్ల బిజెపి ఎలుబడిలో ఒక్క నిమిషం కరెంట్ ఉచితంగా ఇచ్చారా అని మంత్రి ప్రశ్నించారు.
కేసీఆర్ కిట్,కళ్యాణాలక్ష్మి/షాదిముబారక్, రైతుబందు,రైతుభీమా లు బిజెపి పాలిత రాష్ట్రాలలో ఎందుకు అమలు పరచడం లేదని, పాదయాత్రలో సంజయ్ ప్రజలకు ఏమి చెబుతాడని జగదేశ్ రెడ్డి అడిగారు. పెట్రోల్ 100,డీజిల్ 100,గ్యాస్ 1000 కి పెంచినం అని చెబుతార? ఓట్లు వేస్తే మళ్ళీ డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచుతామని చెబుతారా అని మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.
Also Read : అవినీతి మంత్రులకు కెసిఆర్ వత్తాసు – బిజెపి