ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ ప్రాంతానికి చెందినా 19 ఏళ్ళ సౌరభ్ గత ఏడాది (2021) న్యూఢిల్లీ లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ పోటీల్లో కూడా10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషుల విభాగంలో, మిక్స్డ్ విభాగంలో స్వర్ణం సాధించాడు. 2019లో న్యూ ఢిల్లీ, మునిచ్, బీజింగ్ లో జరిగిన వరల్డ్ కప్ పోటీల్లో కూడా మిక్స్డ్ విభాగంలో బంగారు పతకాలు సాధించి సత్తా చాటాడు.
సౌరభ్ కు స్వర్ణం
Saurabh Gold : భారత షూటర్ సౌరభ్ చౌదరి ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్ లో స్వర్ణపతకం సాధించాడు. ఇంటర్నేషనల్ షూటింగ్ సపోర్ట్ ఫెడరేషన్ అధ్వర్యంలో ఈజిప్ట్ లోని కైరోలో జరుగుతోన్న వరల్డ్ కప్ లో 10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఈ ఘనత సాధించాడు. జర్మనీ కి చెందిన మిచెల్ స్క్వాడ్ రెండో స్థానంలో నిలిచి రజత పతకం పొందాడు. ఫిబ్రవరి 26న ప్రారంభమైన ఈ పోటీలు మార్చి 8 వరకూ జరగనున్నాయి.