ICC Women WC: ఐసిసి మహిళా వరల్డ్ కప్ రెండో మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై సౌతాఫ్రికా 32 పరుగులతో విజయం సాధించింది, డునేడిన్ లోని యూనివర్సిటీ ఓవల్ మైదానంలో ఈ బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో సౌతాఫ్రికా మహిళలు 49.5 ఓవర్లలో 201 పరుగులు మాత్రమె చేసి ఆలౌట్ అయ్యారు. సౌతాఫ్రికా జట్టులో కాప్-42; ఓపెనర్ వోల్వార్ట్-41; టైరన్-39; కెప్టెన్ సునే లూస్-25 పరుగులు చేశారు.
లక్ష్యం స్వల్పమే అయినా సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి బంగ్లా ప్లేయర్లు చేతులెత్తేశారు. ఓపెనర్ షెర్మన్ అక్తెర్-34; కెప్టెన్ నైగర్ సుల్తానా-29; మరో ఓపెనర్ షమీనా సుల్తానా-27; రితూ మోనీ -27 పరుగులు చేశారు, దీనితో 49.3 ఓవర్లలో 175 పరుగులకే బంగ్లా మహిళలు ఆలౌట్ అయ్యారు.
నాలుగు వికెట్లతో బంగ్లా టాపార్డర్ ను దెబ్బతీసిన సౌతాఫ్రికా బౌలర్ ఆయబొంగా ఖాక కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Also Read : మహిళల వరల్డ్ కప్: కివీస్ కు విండీస్ షాక్