Saturday, November 23, 2024
HomeTrending Newsచేనేతపై జీఎస్టీ తగ్గించండి: లోకేష్ వినతి

చేనేతపై జీఎస్టీ తగ్గించండి: లోకేష్ వినతి

Reduce GST: చేనేత రంగంపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించాలని, రాబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు.  ఈ మేరకు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లోకేష్ లేఖ రాశారు. కోవిడ్ మహమ్మారి వల్ల చేనేత రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని, తగిన డిమాండ్ లేకపోవడం వల్ల సప్లై చైన్ ఆగిపోయిందని, కోట్లాది రూపాయల సరుకు అమ్ముడుపోకుండా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.  దేశవ్యాప్తంగా చేనేత రంగంలో ఆంధ్ర ప్రదేశ్ పాత్ర ఎంతో ప్రముఖమైనదని, లక్షలాదిమంది కార్మికులు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. రెండేళ్లుగా తాను ఎంతోమంది నేత కార్మికులను వ్యక్తిగతంగా కలుస్తూ వస్తున్నానన్నారు.

గతంలో తమ హయాంలో అందించిన సబ్సిడీలు, సంక్షేమ కార్యక్రమాలు  రాష్ట్ర ప్రభుత్వం ఆపేసిందని, వారికి రుణ సౌకర్యం కూడా నిలిపివేసిందని లోకేష్ ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో వారి జీవితం దుర్భరంగా తయారైందని.. జీఎస్టీ పెంపుతో వారిపై మరింత భారం పడుతోందన్నారు. పెరుగుతున్న భారంతో నేతన్నలు పూర్తిగా ఈ రంగాన్ని వదిలేయాల్సిన దుస్థితి నెలకొని ఉంటుందన్నారు. ఆత్మ నిర్భర్ భారత్, స్థానిక ఉత్పత్తుల కొనుగోలుకు ప్రాధాన్యత ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా చేనేత,జౌళి రంగాన్ని కూడా ప్రోత్సహించాల్సి ఉందన్నారు. లేనిపక్షంలో ఈ పరిశ్రమ మనుగడ ప్రమాదంలో పడుతుందన్నారు.

రాష్ట్రంలో 65 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, ౩.౩. లక్షల చేనేత మగ్గాలు ఉన్నాయని, 16లక్షల మంది నేతన్నలు, స్పిన్నర్లు, కార్మికులకు ఉపాధి లభిస్తోందని లేఖలో  వివరించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచీ ఈ రంగంపై ట్యాక్స్ వేయలేదని, కేవలం జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత నుంచే  వారిపై కూడా పన్ను విధించారని, ఇప్పుడు దాన్ని 5 నుంచి 12 శాతానికి పెంచడం దారుణమన్నారు.  కరోనా దెబ్బతో పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిన ఈ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదారంగా ఆదుకోవాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు.

Also Read : ఇది నిరంకుశత్వం: నారా లోకేష్

RELATED ARTICLES

Most Popular

న్యూస్