recall him: విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాదరెడ్డి నిత్యం వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ వర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆరోపించారు. వెంటనే ఆయన్ను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అయన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. యూనివర్సిటీలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయని లేఖలో వివరించారు.
ప్రసాద రెడ్డి వర్సిటీని అవినీతి, అక్రమాలకు అడ్డగా మార్చారని లేఖలో లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన్ను వెంటనే రీకాల్ చేసి విద్యార్ధుల భవిష్యత్ ను కాపాడాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు.