ఆరు రాష్ట్రాలలో రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ లో 13 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలో షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 21న నామినేషన్ దాఖలకు చివరి తేదీ. మార్చి 24 వతేదీన నామినేషన్ ఉపసంహరణకు గడువు. మార్చి 31న పోలింగ్ జరిగిన తర్వాత అదే రోజు ఓట్ల లెక్కింపు ఉంటుంది. రాష్ట్రాల వారిగా రాజ్యసభ స్థానాల ఖాళీల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
అస్సాంలో 2 ,
హిమాచల్ ప్రదేశ్ లో 1,
కేరళలో 3,
నాగాలాండ్ లో 1,
త్రిపురలో 1,
పంజాబ్ లో 5 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
పంజాబ్ లో కొత్త ప్రభుత్వం రానున్న నేపథ్యంలో అధికారంలోకి వచ్చే పార్టీకి సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. పంజాబ్ లో ఒకింత గెలుపుపై ఆశతో ఉన్న కాంగ్రెస్ నేతలు అప్పుడే రాజ్యసభ స్థానాలపై లెక్కలు వేసుకుంటున్నారు. శాసనసభ ఎన్నికల్లో టికెట్ దక్కని వారు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు.