Saturday, September 21, 2024
Homeసినిమాజీవో ఇచ్చినందుకు సీఎంకు ధన్యవాదాలు : ఫిలిం ఛాంబర్

జీవో ఇచ్చినందుకు సీఎంకు ధన్యవాదాలు : ఫిలిం ఛాంబర్

Thanks to CM: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ఇచ్చిన జిఓ సంతృప్తికరంగా ఉందంటూ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యులు తెలియజేశారు. ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విషయంలో చొరవ చూపిన దర్శక నటుడు. ఆర్. నారాయణమూర్తికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు సి.కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్వీ ప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ .. “వివాదాలకు తెరదించుతూ ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలపై జీవో ఇవ్వడం ఆనందంగా ఉంది. తెలుగు పరిశ్రమ తరపున సీఎంకు ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో పరిశ్రమను అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. దానికి మేం కూడా కృషి చేస్తాం. ఈ విషయమై మరోసారి సమావేశమవుతాం. త్వరలోనే తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులను కలిసి సన్మానిస్తాం. పరిశ్రమలోని సమస్యలు తీర్చేందుకు చిరంజీవి గారు ముందుకొచ్చారు. సమస్యల పరిష్కారంలో చిరంజీవి కీలక పాత్ర పోషించారు. ఇండస్ట్రీ విషయంలో ఆయనే మాకు పెద్ద అన్ని అన్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ .. “మా విజ్ఞప్తిని స్వీకరించి, అమలు చేసినందుకు ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇతర సమస్యలకూ త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం. సినిమా రంగానికి సంబంధించిన అన్ని విషయాలను ఫిలిం ఛాంబర్ ద్వారా చర్చించి చిరంజీవి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్ గారిని కలవడం.. ఆయన సమస్యలను పరిశీలించి కొత్త జీఓ తేవడం. ముఖ్యంగా చిన్న సినిమాకు ఐదో షో కి పర్మిషన్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.

నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ .. ఏపీ ప్రభుత్వం వెలువరించిన కొత్త జీవో ఎన్నో సంవత్సరాల సమస్యలకు చెక్ పెట్టినట్టైంది. పాత జీవో నం. 15 తోనే డిస్ట్రిబ్యూటర్లు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడొచ్చిన జీవో అందరికీ సంతోషంగా ఉంది. పేర్ని నాని గారు ఎన్నో విధాలుగా మాకు సహకరించారు. ఎన్నిసార్లు అడిగితే అన్ని సార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇదే జీవో “భీమ్లా నాయక్ ముందు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. మిగిలిన చిన్న చిన్న సమస్యలను మేం పరిష్కరించుకుంటాం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు హృదయ పూర్వక ధన్యవాదాలు. ప్రభుత్వాలు ఎప్పుడూ చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి, సమస్యలను పరిష్కరించేందుకు చిరంజీవి ముందుకు రావడం అభినందనీయం. త్వరలోనే జగన్ గారిని ఇండస్ట్రీ తరపున మరోసారి కలిసి ఆయనకు అభినందనలు తెలియ చేస్తాం అన్నారు.

నిర్మాత చదలవాడ శ్రీనివాస్ మాట్లాడుతూ .. “టాలీవుడ్ నుంచి ఎన్నో ఉత్తమ చిత్రాలు వస్తున్నాయి. ప్రధానమంత్రి కూడా ఈ విషయాన్ని గుర్తించారు. నిర్మాతలు తాము రూపొందిన ప్రొడక్ట్స్ (సినిమా)ను మార్కెట్ చేసుకునేందుకు థియేటర్లు అవసరం. థియటర్స్ బాగుంటేనే సినీ పరిశ్రమను కళకళలాడుతుంది. చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహకారం కావాలి. అలాగే ఛాంబర్ కు స్థలం కేటాయించాలని వారిని కోరుతున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ అనుపమ్ రెడ్డి, శ్రీ చంద్ర ప్రసాద్, వై. రామ్మోహన్ రావు, పి. కిరణ్, సి. భగవాన్, మోహన్ వడ్లపట్ల, సురేందర్ రెడ్డి తదితరులు కూడా పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు.

Also Read : ఎట్టకేలకు టికెట్ జీవో!

RELATED ARTICLES

Most Popular

న్యూస్