YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల యస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర 400 కిలో మీటర్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు మండలం చండేపల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని వైయస్ షర్మిల ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర 34 వ రోజు నేతలు, పార్టీ శ్రేణులు అనుసరిస్తుండగా యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతోంది.
ప్రజా సమస్యలపై YSR తెలంగాణ పార్టీ పోరాడుతూనే ఉంటుందని వైయస్ షర్మిల పునరుద్ఘాటించారు. YSR తెలంగాణ పార్టీ ఒత్తిడితోనే ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యోగ ప్రకటన చేశారని అన్నారు. రాష్ట్రంలోని 90 నియోజకవర్గాలు, 14 పార్లమెంట్ స్థానాల్లో 4 వందల రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు లక్ష్యంగా 2021 ఆగస్టు 20వ తేదీన ఈ ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలో 2023 ఎన్నికల్లో ఉనికి చాటుకునేందుకు, సత్తా చాటడానికి వైయస్ షర్మిల తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు
Also Read : కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ బర్తరఫ్ కు టీఆర్ఎస్ డిమాండ్