Sunday, January 19, 2025
HomeTrending Newsఇష్టానుసారం మాట్లాడతారా? బాబు

ఇష్టానుసారం మాట్లాడతారా? బాబు

Its not fair: అమరావతి రాజధానిపై హైకోర్టు తీర్పుపై ఏవైనా అభ్యంతరాలుంటే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి ఉండాల్సిందని  టిడిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని ఐదు కోట్ల ప్రజల సమస్య అని, అసెంబ్లీలో కూర్చొని ఇష్టానుసారంగా మాట్లాడతారా అని ప్రశ్నించారు. సీఆర్డీఏతో ఒప్పందం చేసుకున్న రైతులు వెనక్కు వెళ్తామంటే ప్రభుత్వం ఒప్పుకుంటుందా? రైతులకు ఒప్పందాలు వర్తించినప్పుడు.. ప్రభుత్వానికి ఒప్పందాలు వర్తించవా? అని ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు జగన్ కు లేదని మూడు రాజదానులపై అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు.

2016లో అమరావతిని రాజధానిగా ఎందుకు అంగీకరించారని, అప్పుడు అంగీకరించి ఇప్పుడు మాట తప్పినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో కౌరవులు కూడా తాము వందమందిమి ఉన్నామని విర్రవీగారని, చివరకు ఏమైందో తెలుసుకోవాలని హితవు పలికారు.

చట్టసభల్లో ఉన్న వాళ్లు అన్ని వ్యవస్థలను గౌరవించే మనస్తత్వంతో ఉండాలని, అమరావతిలోనే కాదు.. విశాఖ, ఇడుపులపాయ, బెంగళూరు, చెన్నైల్లో కూడా సీఎం ఇళ్లు కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఇల్లు కట్టుకున్నానంటూ రబ్బీష్ మాటలు ఎందుకు చెబుతున్నారని బాబు  మండిపడ్డారు.

బాబు మాట్లాడిన ముఖ్యాంశాలు:

  • ప్రభుత్వం మళ్ళీ మూడు  ముక్కలాటకు తెరతీసింది.
  • రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికీ ప్రాథమిక హక్కులుంటాయి
  • చట్ట సభాలు ఎలా ఉండాలి, ఎలాంటి చట్టాలు చేయాలో రాజ్యాంగంలో ఉంది
  • రాజ్యాంగానికి లోబడే చట్టాలు చేయాలి
  • చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత కార్యనిర్వాహక వ్యవస్థది
  • చట్టాల్లో తప్పులుంటే న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుంటుంది
  • ప్రజలను చంపేస్తామంటూ చట్టం చేయడం కుదరదుకదా?
  • సీఆర్దీయే చట్టంద్వారా రైతులతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు
  • నేను చెప్పిందే వేదం అంటే కుదరదు
  • అమరావతి గురించి మాట్లాడే హక్కు ఈ ప్రభుత్వానికి ఉందా?

Also Read : వికేంద్రీకరణపై వెనకడుగు లేదు: సిఎం జగన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్