Misappropriation: ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో ప్రజలకు ఒరిగేదేమీ లేదని టిడిపి ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ విమర్శించారు. ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి అప్పులు చేస్తున్నారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక అవకతవకలను త్వరలో కేంద్రం దృష్టికి సమగ్రంగా తీసుకు వెళతామని చెప్పారు. 48 వేల కోట్ల రూపాయలకు కు సంబంధించి ప్రభుత్వం వద్ద లెక్కలు లేవని, ఇదే విషయాని తాను గతంలో చెబితే ఆర్ధిక మంత్రి బుగ్గన తప్పుబట్టారని, కానీ నేడు కాగ్ తన రిపోర్టులో అదే విషయం చెప్పిందన్నారు. ఈ లెక్కలు ట్రెజరీ కోడ్ ప్రకారం అధికారిక ఖాతాల ద్వారా జరగలేదని కాగ్ చెబితే, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఈ లెక్కలను ర్యాటిఫై చేసుకుంటూ తనకు తానే సర్టిఫికేట్ ఇచ్చుకున్నారని, తనకు లేని అధికారాలను సంక్రమించుకుంటూ జీవో ఇచ్చారని కేశవ్ విస్మయం వ్యక్తం చేశారు.
కాగ్ నివేదికపై టిడిపి కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో కేశవ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అయన చెప్పిన ముఖ్యంశాలు:
ఈ బడ్జెట్ ఒక నాటకం
ఉద్యోగులు జీతాలు పెంచమంటే ఆదాయం లేదని చెబుతున్నారు
చంద్రబాబు మీకు అధికారాన్ని అప్పగించిన రోజు ఆదాయం 1,14,870 వేల కోట్ల రూపాయలు
ఇప్పుడు మీరు చూపించిన ఆదాయం 1,91, 225 వేల కోట్ల రూపాయలు
కేంద్రం నుంచి వచ్చిన నిధులు రెట్టింపయ్యాయి
ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ల మీద పన్నులు భారీగా పెంచారు. బాదుడే… బాదుడు
చెత్తతో సహా ప్రజలపై పన్నుల భారం విపరీతంగా పెంచారు
నీటిపారుదలశాఖలో ఈ మూడేళ్ళలో ఎంత మేరకు ఖర్చు చేశారు? మేం ఒక సంవత్సరంలో పెట్టిన ఖర్చును మీరు ఈ మూడేళ్ళలో కూడా పెట్టలేకపోయారు
2018-19 క్యాపిటల్ వ్యయం 20 వేల కోట్ల రూపాయలు ఉంటే ఇప్పుడు భారీగా పడిపోయింది
వ్యవసాయ శాఖను మూసివేసే దిశగా తీసుకు వెళుతున్నారు
వ్యవసాయానికి 12 వేల కోట్లు పెట్టామని చెబుతున్నారు, వీటిలో 7 వేల కోట్లు రైతు భరోసాకే… మళ్ళీ ఈ ఏడు వేల కోట్ల రూపాయల్లో కేంద్రం ఇచ్చేది ౩ వేల కోట్లు ఉంది
జీత భత్యాలకు మినహా మీరు ఖర్చు పెడుతున్నది రైతు భరోసాకు మాత్రమే
60:40 నిష్పత్తిలో అమలయ్య పథకాల్లో మనం 40 పైసలు పెడితే కేంద్రం 60 పైసలు ఇస్తుంది, ఇలాంటి పథకాల్లో 11 కి కనీసం ఒక్క పైసా కూడా వాటా ఇవ్వలేకపోయారు.
ఈ బడ్జెట్ ఒక బూటకం
ఇది అప్రాప్రియేషన్ బిల్ కాదు, మిసప్రాప్రియేషన్ బిల్లు
Also Read : బాబుది కడుపుమంట: బొత్స