Saturday, November 23, 2024
HomeTrending Newsరాష్ట్రంలో 360 విధించాలి: యనమల

రాష్ట్రంలో 360 విధించాలి: యనమల

Impose 360: ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆర్ధిక ఎమర్జెన్సీని విధించాలని,  360 నిబంధన అమలు చేయాలని శాసనమండలి విపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. కేంద్రం రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టిందన్నారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో యనమల మాట్లాడారు. 48వేల కోట్ల నిధులకు లెక్కలు కనబడడం లేదని కాగ్ తన రిపోర్టులో చెప్పిందని యనమల అన్నారు. ఇవి ఎవరి జేబుల్లోకి వెళ్ళాయో చెప్పాల్సిన అవసరముందన్నారు.

చట్టసభలను సొంతానికి వాడుకుంటున్నారని, వారికి వారు డప్పు కొట్టుకోవదానికే జగన్ ప్రభుత్వం వినియోగించు కుంటోందని ఆరోపించారు.  కోర్టులు ఇచ్చిన తీర్పులపై చట్టసభల్లో మాట్లాడకూడదన్న నిబంధన రాజ్యాంగంలో ఉందని, అయినా అమరావతి రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర శాసన సభలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి మాట్లాడారని చెప్పారు.

యనమల మీడియా సమావేశం ముఖ్యాంశాలు:

  • రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి
  • రాష్ట్రంలో అప్పులు, అవినీతి తప్ప అభివృద్ధి లేదు
  • సంక్షేమ కార్యక్రమాలు కూడా అనుకున్నంతగా లేవు
  • మూడేళ్ళ పాలనలో గత రెండు ఆర్ధిక సంవత్సరాల ఆడిట్ నివేదికలు వచ్చాయి
  • 48 వేల కోట్ల రూపాయలు లెక్కలు లేవంటే ఇవి కచ్చితంగా వైసీపీ నేతల జేబుల్లోకే వెళ్లి ఉంటాయి
  • స్పెషల్ బిల్స్ పేరుతో జీవో ఇచ్చారు. ట్రెజరీ కోడ్ లో స్పెషల్ బిల్ అనే పదం లేదు.
  • సిఎఫ్ఎంఎస్ నిబంధనలు కూడా అతిక్రమించారు
  • ప్రజల కోసం ఖర్చు పెడితే లెక్కలు ఎందుకు చెప్పడం లేదు?
  • ఈ నిధుల దుర్వినియోగంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, సిబిఐ విచారణ జరిపించాలి
  • అప్పుల్లో ఓపెన్ మార్కెట్ అప్పులు (బడ్జెట్ బారోయింగ్స్), ఆఫ్ మార్కెట్ అప్పులు (ఆఫ్ నాన్ బడ్జెట్ బారోయింగ్స్)  అని రెండు రకాలుగా ఉంటాయి
  • 15వ ఆర్ధిక సంఘం నాన్ బడ్జెట్ బారోయింగ్స్ ను కూడా బడ్జెట్ లెక్కల్లో చూపించాలని స్పష్టంగా చెప్పింది
  • ఈ ప్రభుత్వం కార్పోరేషన్ల పేరిట ఏటా లక్ష కోట్ల రూపాయలకు పైగా అప్పులు తెస్తోంది.
  • ఈ అప్పులను బడ్జెట్ లో చూపించడంలేదు
  • మూడేళ్ళలోనే ఇంత తీవ్రమైన పరిస్థితులుంటే 2024 ఆర్ధిక సంవత్సరానికి 8నుంచి 9లక్షల కోట్ల రూపాయలకు  చేరుకుంటాయి
  • ఏటా అప్పులపై వడ్డీల కోసం 21 వేల కోట్లు వెచ్చిస్తున్నాం, అసలులో ఏటా 10 వేల కోట్లు చెల్లిస్తున్నాం
  • అంటే రెండూ కలిపి 31 వేల కోట్ల రూపాయల పైచిలుకు వెళ్ళిపోతుంది,  కానీ ఆదాయం పెరగడం లేదు
  • రెండేళ్ళు ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రాన్ని ఎవరూ చూసే పరిస్థితి కూడా ఉండదు
  • జీతాలు ఇచ్చి కూర్చోవడం తప్ప  ఇంకేమీ ఉండదు
  • వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, ఆర్ధిక ఎమర్జెన్సీ విధించి రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడాలి
  • సహజ వనరులను కాపాడాలి
RELATED ARTICLES

Most Popular

న్యూస్