Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్ఐపీఎల్: రాజస్థాన్ కు రెండో విజయం

ఐపీఎల్: రాజస్థాన్ కు రెండో విజయం

RR 2nd: ఐపీఎల్ లో నేడు జరిగిన మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై రాజస్థాన్ రాయల్స్ 23 పరుగుల తేడాతో గెలుపొందింది. రాజస్థాన్ ఆటగాడు జోస్ బట్లర్ ఈ సీజన్ లో తొలి సెంచరీ నమోదు చేశాడు. నవీ ముంబై లోని డా. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్(1); దేవదత్ పడిక్కల్ (7) త్వరగా ఔటయ్యారు. ఈ సమయంలో మరో ఓపెనర్ బట్లర్, కెప్టెన్ సంజూ శ్యామ్సన్ లు మూడో వికెట్ కు 88 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. సంజూ 21 బంతుల్లో ఒక ఫోర్, 3సిక్సర్లతో 30 పరుగులు చేసి ఔటయ్యాడు.  బట్లర్- హెట్మెయిర్ నాలుగో వికెట్ కు 53 పరుగులు జోడించారు. హెట్మెయిర్ ధాటిగా ఆడి 14 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 35 పరుగులు చేసి ఔటయ్యాడు. బట్లర్ 68 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో సరిగ్గా 100 పరుగులు చేసి ఔటయ్యాడు. నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో బుమ్రా, తైమల్ మిల్స్ చెరో మూడు, పోలార్డ్ ఒక వికెట్ పడగొట్టారు.

ముంబై కెప్టెన్ రోహిత్ (10) మరోసారి విఫలమయ్యాడు, జట్టు స్కోరు 15వద్ద ప్రసిద్ కృష్ణ బౌలింగ్ లో ఔటయ్యాడు. అన్మోల్ ప్రీత్ సింగ్ కూడా కేవలం ఐదు పరుగులే చేశాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్, తిలక్ వర్మలు ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టి మూడో వికెట్ కు 81 పరుగులు చేశారు. ఇషాన్ కిషన్-54(43బంతుల్లో 5ఫోర్లు, 1సిక్సర్); తిలక్-61(33 బంతుల్లో 3ఫోర్లు, 5 సిక్సర్లు) చేశారు. 15 పరుగుల తేడాలో వీరిద్దరూ అవుట్ కావడంతో ముంబై జోరుకు బ్రేక్ పడింది. చివర్లో పోలార్డ్ 22 పరుగులు చేసినా రన్ రేట్ అందుకోలేకపోయారు. 20 ఓవర్లలో 8 వికెట్లకు 70 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజస్థాన్ బౌలర్లలో యజువేంద్ర చాహల్, నవదీప్ షైనీ చెరో రెండు; బౌల్ట్, ప్రసిద్, రవిచంద్రన్ అశ్విన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

సెంచరీ సాధించిన జోస్ బట్లర్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

Also Read : ఐపీఎల్: పంజాబ్ పై కోల్ కతా ఘనవిజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్