కరోనా లాక్ డౌన్ సంవత్సరంగా ముద్ర పడ్డ గడచిన ఏడాది గృహ నిర్బంధాల్లో ఉంటూ గూగుల్లో అత్యధికంగా జనం ఏమేమి శోధించారో తెలుసుకోవడానికి ఒక సర్వే చేశారు.
1 . భార్యను అదుపులో పెట్టుకోవడం ఎలా?
2. బయటివారు గమనించకుండా భార్యను కొట్టడం ఎలా?
అన్న ప్రశ్నలకు సమాధానం కోసం ప్రపంచవ్యాప్తంగా పదహారున్నర కోట్ల సార్లు జనం గూగుల్ ను అడిగారట.
లాక్ డౌన్ లో గృహ హింస పెరిగిందనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. నిజంగా పదహారున్నర కోట్ల సార్లు భార్యలను భర్తలు హింసించి ఉంటే- ఈ నేరంలో గూగుల్ ను కూడా భాగస్వామిని చేసి, దోషిగా నిరూపించాలి!