Social Justice: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ ఎస్సీ, ఎస్టీ,బీసీ మైనార్టీలకు ప్రాధాన్యం ఇస్తోందని, ఈ సారి కేబినెట్లో 68 శాతం మంది ఈ వర్గాల వారికి చోటు కల్పించామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం మంత్రి పదవుల్లోనే కాకుండా నామినేటెడ్ పదవుల్లో కూడా పెద్ద పీట వేశామని, బీలకు ఏకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈసారి కూడా ఐదుగురు డిప్యూటీ సిఎంలు ఉంటారని ప్రకటించారు.
- బీసీ డిక్లరేషన్ తోనే బీసీలంటే బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్ అన్న నినాదం విధానంగా మార్చుకున్నాం
- 2019 ఎన్నికల్లో అతి పెద్ద విజయంతో అధికారంలోకి వచ్చిన తరువాత తొలి కేబినెట్ లో కూడా 14 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు చోటు కల్పిస్తే, 11 మంది ఒసీలకు స్థానం కల్పించాం
- ఈసారి 17 మందికి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు, 8 మంది ఒసీలకు స్థానం కల్పించాం
- గత చంద్రబాబు హయాంలో ఈ వర్గాలకు 48 శాతంలోపే పదవులు ఇచ్చారు
- ఉన్నది కేవలం 25 పదవులు మాత్రమే, అందుకే ఆశావహులందరినీ సంతృప్తి పరచలేం
- మొత్తంగా మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయం చేశాం
- ఈ పునర్ వ్యవస్థీకరణ ఎన్నికల కోసం చేసింది కాదు, సామాజిక కేబినెట్
- వివిధ కారణాలతో మంత్రి పదవులు ఇవ్వలేక పోయిన వారికి పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఇతర పదవులు కల్పిస్తాం
- సామాజిక న్యాయం నినాదం కాదు, నిజం చేశాం
- శాసన సభలో చీఫ్ విప్ గా ప్రసాద రాజు (క్షత్రియ)
- ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా మల్లాది విష్ణు (బ్రాహ్మణ)
- డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్ర స్వామి (వైశ్య)
- స్టేట్ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్ గా కొడాలి నాని (కమ్మ)కు అవకాశం కల్పిస్తాం
Also Read : బీసీలకు మరింత ప్రాధాన్యం : సజ్జల వెల్లడి