Saturday, November 23, 2024
HomeTrending Newsబిజెపి విస్తరణకు కృషి చేస్తా : ఈటెల

బిజెపి విస్తరణకు కృషి చేస్తా : ఈటెల

బిజెపి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు. తెలంగాణాలో బిజెపి విస్తరణకు శాయశక్తులా కృషి చేస్తానని, రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల నుంచి బిజెపిలో చేరికలు ఉంటాయని వెల్లడించారు. రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అందరినీ కలుపుకుని పనిచేశామని వివరించారు.

మాజీమంత్రి ఈటెల రాజేందర్ బిజేపిలో చేరారు. కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఈటెలకు కాషాయ కండువా కప్పి పార్టీ సభ్యత్వం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కే. అరుణ, బిజెపి ప్రధాన కార్యదర్శి వి. మురళీధర్ రావు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, ఎంపి సోయం బాబురావు, మాజీ ఎంపి వివేక్ తదితరులు ఈ కార్యక్రంమంలో పాల్గొన్నారు. రాజేందర్ తో పాటు ఏనుగు రవీందర్ రెడ్డ్తి, రమేష్ రాథోడ్, తుల ఉమ, అశ్వత్ధామరెడ్డి, గండ్ర నళిని, ఓయూ జేఎసి నేతలు కమలం పార్టీలో చేరారు.

తెలంగాణాలో ప్రజలు బిజెపిని ఆదరిస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా బిజెపి అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక తరువాత తెలంగాణాలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ఈటెల సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నేత అని, ఆయన రాకతో తమ పార్టీ బలం మరింత పెరిగిందన్నారు.

తెలంగాణాలో దొరల పాలనను అంతమొందించేందుకు, గడిలను బద్దలు కొట్టేందుకు ఈటెల రాజేందర్ కాషాయం జెండా, కమలం పువ్వు పార్టీలోకి రావడం సంతోషమని ఎంపి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నియంత పాలన నుండి బైటకు వచ్చిన రాజేందర్ కు రాష్ట్ర పార్టీ తరఫున స్వాగతం పలుకుతున్నామన్నారు, తెలంగాణా తల్లిని బంధ విముక్తం చేయడంలో, ప్రజాస్వామిక తెలంగాణా ఏర్పాటులో బిజెపి చేస్తున్న పోరాటంలో అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఏ నమ్మకంతో అయితే ఈటెల బిజెపిలో చేరారో, అయన ఆశయాలకు, పోరాటాలకు బిజెపి అండగా ఉంటుందని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్