YSRCP Job Mela: అధికారంలోకి వచ్చిన 35 నెలల్లోనే 6 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్య సభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి అన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న జాబ్‌మేళాను విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా యువత కోసం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నామని వివరించారు.
రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో దశలవారీగా జాబ్‌మేళా నిర్వహిస్తామని వెల్లడించారు. వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని కన్ఫర్మేషన్ లెటర్ వచ్చినవారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మెగా జాబ్‌మేళా ద్వారా 25 వేల మందికి ఉపాధి కల్పించనున్నట్టు చెప్పారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో మెగా జాబ్‌మేళా నేడు, రేపు కొనసాగుతుందని వివరించారు.