Saturday, November 23, 2024
HomeTrending Newsరాజకీయం కోసమే కెసిఆర్ వడ్ల డ్రామా -షర్మిల

రాజకీయం కోసమే కెసిఆర్ వడ్ల డ్రామా -షర్మిల

Paddy Purchase issue: ఏళ్లుగా పోడు భూములకోసం పోరాటం జరుగుతూనే ఉందని, జల్,జంగల్,జమీన్ అని మొదలైన పోరాటం ఈ రోజు వరకు కూడా జరుగుతుందని వై ఎస్ ఆర్ టి పి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. పేదల మీద ఇప్పుడు కూడా కేసులు పెడుతూనే ఉన్నారని అన్నారు. 61 వ రోజు ప్రజా ప్రస్థానం పాదయాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజక వర్గం పాల్వంచ మండలం కరక వాగు గ్రామంలో రైతు గోస దీక్షలో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఇంద్రవెల్లి ఘటన జరిగి నేటికి 42 యేళ్లు పూర్తయిన సందర్భంగా పోడు భూముల కోసం పోరాడి చనిపోయిన ఆదివాసీలకు షర్మిల నివాళులు అర్పించారు.  ఇదే ఖమ్మం జిల్లాలో 21 మంది మహిళలను లాఠీలతో కొట్టి జైల్లో పెట్టారని, కాళ్ళు పట్టుకుంటే తప్పా మంచినీళ్ళు కూడా ఇవ్వలేదని… ఇది ఎప్పుడో కాదు కేసీఆర్ పాలన లో జరిగిన ఘోరమే అన్నారు.

పోడు భూముల సమస్యలను పరిష్కరించింది కేవలం వైఎస్సార్ మాత్రమే అన్న షర్మిల వైఎస్సార్ ఈ ఖమ్మం జిల్లాలోనే లక్షా 90 వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నికలప్పుడు కేసీఆర్ పోడు భూముల సమస్య పరిష్కారం అన్నాడని, కుర్చీ వేసుకొని కూర్చొని సమస్య పరిష్కారం అన్నాడు…ఇంతవరకు కేసీఆర్ ఎందుకు పరిష్కరించలేదని షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ కి చిత్తశుద్ది లేదు..పరిష్కరించేందుకు చేత కాదన్నారు. ఈ పాపం కేసీఆర్ కి తగులుతుందని, సీఎం భోగాలు అనుభవిస్తున్నాడని విమర్శించారు.

కేసీఆర్ దృష్టిలో అసలు తెలంగాణ లో సమస్యలు లేవని, కేసీఆర్ మత్తులో పూటకో మాట మాట్లాడుతాడన్నాడని ఎద్దేవా చేశారు. ఒకసారి వడ్లు కొన అంటాడు..మళ్ళీ రాజకీయాల కోసం నేనే కొంటా అంటాడని విమర్శించారు. మిర్చికి నష్ట పరిహారం అంటాడు..మరిచి పోతాడని..ఇంటికి వెళ్ళి నిద్ర పోయి మళ్ళీ మరిచి పోతాడన్నారు. కేసీఆర్ మాట అసలు నమ్మొచ్చా…కేసీఆర్ ఒక తప్పుడు సంతకం వల్ల కేంద్రం మన వడ్లు కొనను అని చెప్పిందని షర్మిల అన్నారు. ఢిల్లీకి వెళ్లి పోరాడుతానని చెప్పి… చేతులు ఊపుకుంటూ ఖాళీగా వచ్చాడని, ఈ రోజు వరకు కొనుగోలు కేంద్రాలు తెరవలేదన్నారు. కోంటామని చెప్పి ఎందుకు కేంద్రాలు తెరవలేదని, రాజకీయాల కోసమే కేసీఆర్ డ్రామాలు, వడ్లు కొనాలని ఉద్యేశ్యం కేసీఆర్ కి లేదన్నారు. వడ్లు కొంటాను అని చెప్పి 500 వందల కొనుగోలు కేంద్రాలు తెరిచారని, అందులో 30 కేంద్రాల దగ్గరే వడ్లు కొంటున్నారని చెప్పారు. మిగతా కొనుగోలు కేంద్రాలు తెరిచిన పాపాన పోలేదన్నారు. పోలీస్ లు ఉన్నది ప్రజలకు రక్షణ కల్పించడం కోసమని, అధికార పార్టీ రక్షణ కోసం పోలీస్ లను పనోల్లు గా పెట్టుకున్నారని తెరాస తీరుపై విమర్శలు గుప్పించారు. పాలక పక్షం ప్రజలను గాలికి వదిలేసిందని, ప్రతిపక్షాలు పాలకపక్షం పంచన చేరాయని ఆరోపించారు.

Also Read :  బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది-షర్మిల

RELATED ARTICLES

Most Popular

న్యూస్