Saturday, January 18, 2025
HomeTrending Newsమిల్లర్లతో చర్చలు సఫలం

మిల్లర్లతో చర్చలు సఫలం

యాసంగి ధాన్యం సేకరణలో ప్రభుత్వానికి సహకరిస్తాం, లాబాలు రాకున్నా నష్టం లేకుండా చూడాలని మిల్లర్లు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, రైస్ మిల్లర్లతో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం ఎర్రమంజిల్ లోని సివిల్ సప్లైస్ భవన్లో బేటీ అయ్యారు. యాసంగి ధాన్యం సేకరణపై మిల్లర్లతో నిర్వహించిన ఈ సమావేశం సుధీర్ఘంగా కొనసాగింది, కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాల నుండి పంపిన ధాన్యాన్ని అన్లోడింగ్ చేయడానికి మిల్లర్లు విముఖత చూపిన నేపథ్యంలో వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలని, రైతులను కేంద్రం నట్టేట ముంచిన పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు సంపూర్ణ మద్దతు దరతో తెలంగాణ రైతాంగం పండించిన చివరి గింజ వరకూ సేకరించాలని నిర్ణయించామన్నారు. ఈ సందర్భంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించే ప్రక్రియను సజావుగా నిర్వహించాలని మిల్లర్లకు సూచించారు, మిల్లర్ కు రైతుకు సంబందం ఎందుకని, కొనుగోలు కేంద్రాల్లోనే నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించి మిల్లుకు పంపుతామని ఎట్టి పరిస్తితుల్లోను ఒక్క కిలోను సైతం మిల్లుల్లో కోత పెట్టవద్దని సూచించారు మంత్రి గంగుల కమలాకర్. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో వేసిన కమిటీ నిర్ణయం మేరకు ప్రభుత్వం ముందుకు పోతుందని స్పష్టం చేసారు.

ఈ సమావేశంలో పాల్గొన్న మిల్లర్ల ప్రతినిధులు… కొంత మంది మిల్లర్లను దొంగలుగా చూస్తుంటే బాదగా ఉందన్నారు. ఎవరో ఒకరిద్దరు చేసే తప్పులకు అందర్నీ బాధ్యుల్ని చేయొద్దన్నారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న మిల్లింగ్ ఇండస్ట్రీ యాసంగిలో ఎప్.సి.ఐ కోరిన మేరకు ఔటర్న్ రాదనే భయంతో ధాన్యం అన్లోడింగ్ కు కొంత మంది మిల్లర్లు భయపడుతున్నారని మంత్రి ద్రుష్టికి తమ సమస్యల్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా ఎఫ్.సి.ఐ తో ఇబ్బందుల్ని ప్రస్థావిస్తూ రాష్ట్రంలో 2400 మిల్లుల్లో 1500 పై చీలుకు బాయిల్డ్ మిల్లులున్నాయని తెలిపారు.

మంత్రి గంగుల మాట్లాడుతూ రైస్ మిల్లర్లు లేవనెత్తిన అంశాల్ని ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెల్తానని, సీఎస్ కమిటీ ఖచ్చితంగా అందరికీ అనుకూల నిర్ణయం తీసుకుంటుందన్నారు, ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్తో పాటు, సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ జీఎంలు, ఉన్నతాధికారులు, మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ బాధ్యులు, పెద్ద ఎత్తున మిల్లర్లు పాల్గొన్నారు.

Also Read : మీ ఊరి కోతులెన్ని?

RELATED ARTICLES

Most Popular

న్యూస్