Whiter Paper : ధాన్యం కొనుగోల్లపై ఆరోపణలు నిరాదారమని సివిల్ సప్లైస్ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్ళపై ఈ రోజు మంత్రి శ్వేత పత్రం విడుదల చేసారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వరి పండక పోవడం, ధాన్యం పండించే రాష్ట్రాలైన తెలంగాణ, పంజాబ్, ఓడిషా, చత్తీస్ఘడ్, ఆంద్రప్రదేశ్ వంటి చోట్ల బీజేపీ అధికారంలో లేకపోవడం వల్లనే ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు స్రుష్టిస్తుందన్నారు. యాసంగిలో రా రైస్ రాదని తెలిసినా అదే ఇవ్వాలని మంకు పట్టు పట్టడం, నేడు కొనుగోళ్లు ఊపందుకునే దశలో దాన్ని అడ్డుకునే విదంగా ఎఫ్.సి.ఐ అధికారులను ఉసిగొల్పి రైస్ మిల్లులపై వెరిఫికేషన్ పేరుతో దాడులు చేస్తూ, ధాన్యం దించకుండా అడ్డుకోవడం వంటి చర్యలతో తెలంగాణ రైతులపై కక్ష్య సాధింపు చర్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. కరీంనగర్ నియోజకవర్గంలో ని కొత్తపల్లి మండలం ఎలగందల్ ,చింతకుంట కరీంనగర్ రురల్ మండలం దుర్షేడ్, ముగ్ధుమ్ పూర్ ,చెర్లభుత్కూర్ ,చామన్ పల్లి నగునూర్ గ్రామాల్లో లో DCMS ,iKP ,PACS ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లపై శ్వేత పత్రాన్ని విడుదల చేసారు. మంగళవారం సాయంత్రం వరకూ జరిపిన కోనుగోళ్ల వివరాలు, గన్నీబ్యాగుల అందుబాటు వంటి వివరాల్ని వెల్లడించారు, కొనుగోళ్ల మొదలు పెట్టిన రోజే బహిరంగంగా ఎన్ని గన్నీ బ్యాగులున్నాయన్నామో చెప్పామన్న మంత్రి నేడు కేంద్రం నుండి ఒక్క బ్యాగు రాకున్నా… 7కోట్ల 77 లక్షల గన్నీలను రికార్డు స్థాయిలో సేకరించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3525 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, 4,21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 55553 మంది రైతుల దగ్గరినుండి సేకరించామన్నారు, ఈ ధాన్యం విలువ 821 కోట్లు అన్నారు. ఈ డబ్బుల్ని రైతులకు సకాలంలో అందజేయాలంటే మిల్లర్లు గుర్తించాల్సి ఉంటుందని, ఎఫ్.సి.ఐ అధికారులు ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియ పేరుతో మిల్లర్లు ధాన్యం దించకుండా అడ్డుకుంటున్నారని తద్వారా రైతులకు సకాలంలో ధాన్యం సేకరణ, డబ్బుల విడుదల చేయకుండా కుట్ర పన్నారన్నారు.
వెరిఫికేషన్ జరుగుతున్నప్పుడు రైస్ మిల్లులో ఉండే హమాలీ మొదలు గుమాస్తా, అకౌంటెంట్ వరకూ అక్కడే ఉంటారని ఇది జరిగే వరకూ ఎన్ని రోజులైతే అన్ని రోజులు రైస్ మిల్లులో వేరే పనులు నిర్వహించకుండా మిల్లును మూసేస్తారని మంత్రి వివరించారు. మరి కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన రైతుల ధాన్యం మిల్లర్లు దించుకోకపోతే ఇబ్బందులు పడే రైతులకు ఏం సమాదానం చెపుతారని బిజెపి నేతలను ప్రశ్నించారు. అందుకే ఎప్.సి.ఐకు కొనుగోళ్లు ఊపందుకున్న సమయంలో ఫిజికల్ వెరిఫికేషన్ వద్దని చెప్పామని, అసలు కొనుగోళ్లు ఇప్పుడే మొదలైతే ధాన్యం ఉందో లేదో ఇప్పుడే ఎలా చూస్తారన్నారు. మొత్తం కొనుగోల్ల ప్రక్రియ ముగిసాక అన్ని వివరాలతో పూర్తి స్థాయిలో పీవీ(భౌతిక పరిశీలన) చేయడానకి కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. ఇందుకోసం జూలై మాసంలో పీవీ చేద్దామని లెటర్లు రాసినా పెడచెవిన పెట్టడం అన్యాయమన్నారు.
అకాల వర్షాలు కురుస్తున్న పరిస్థితుల్లో రైతుల ధాన్యం కొనకపోవడం వల్ల తడిస్తే బాధ్యత తీసుకుంటారా అని ప్రశ్నించారు, రైతులకు త్వరగా ప్రక్రియ ముగిసేవిదంగా యుద్ద ప్రతిపాధికన కొనుగోలు కేంద్రాల్లో సకల సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రమాణాల మేరకు ఉన్న ధాన్యాన్ని కొని మిల్లులకు పంపి కిలో తరుగు లేకుండా మేం చూసుకుంటున్నామని, కానీ కేంద్రం ప్రస్థుతం పీవీ పేరుతో స్రుష్టిస్తున్న ఇబ్బందుల్ని ఇకనైనా ఆపాలని మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేసారు.
Also Read : కిలో కూడా తరుగు తీయోద్దు: మంత్రి గంగుల