Vietnam : వియాత్నంలో 4,305 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలోని 56 రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు నమోదు కావటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒకరోజులోనే రెండు వేల కేసులు పెరగటంతో వియాత్నం వైద్య ఆరోగ్య శాఖ కట్టడి చర్యలు చేపట్టింది. రాజధాని హనోయ్ లో 684 హాట్ స్పాట్ లను గుర్తించారు. రాకపోకలపై వియాత్నంలో ఆంక్షలు విధించారు. దేశంలోని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం వెళ్లేందుకు టీకా తీసుకున్న వారినే అనుమతిస్తున్నారు.
ఒమిక్రాన్ సబ్-వేరియంట్లు పలు దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందడం ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికా, దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో బీఏ.2.12.1, బీఏ.4, బీఏ.5 వంటి ఉప-వర్గాల కారణంగా కేసులు భారీగా నమోదవుతున్నాయి. అమెరికాలో బీఏ.2.12.1 వ్యాప్తి ఆందోళనకు గురిచేస్తోంది. ఏప్రిల్ రెండో వారంలో ఈ వేరియంట్ కేసులు 16 శాతం ఉండగా.. ప్రస్తుతం 36 శాతానికి చేరుకున్నట్టు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వెల్లడించింది. అటు, దక్షిణాఫ్రికాలోనూ కొత్త కేసులు ఒక్క రోజులోనే 50 శాతం మేర పెరిగాయి. గురువారం అక్కడ 6,170 కొత్త కేసులు నమోదుకాగా.. గురువారం ఏకంగా 9,757 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు. అక్కడ బీఏ.4, బీఏ.5 సిస్టర్ వేరియంట్స్ కారణంగా మరోసారి కేసులు భారీగా పెరుగుతున్నాయి.