Saturday, November 23, 2024
HomeTrending Newsచట్టం తన పని చేసుకుపోతుంది: బొత్స

చట్టం తన పని చేసుకుపోతుంది: బొత్స

Law takes….: పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై పోలీసులు సమగ్ర విచారణ నిర్వహిస్తున్నారని, ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ తో సమావేశమైన బొత్స మీడియాతో మాట్లాదారు. పేపర్లు ముందుగా లీక్కాలేదని, పరీక్ష మొదలైన తర్వాత గైర్హాజరు అయిన వారి ప్రశ్నాపత్రాలు ఫోన్ ద్వారా ఫోటో తీసి వాట్సాప్ ద్వారా బైటకు పంపారని, ఈ విషయాన్ని వెంటనే గమనించి   చర్యలు తీసుకున్నామని,  ఈ కేసులో 60 మందిని అరెస్టు చేసి విచారించారని చెప్పారు.

నారాయణను ఏ కేసులో అరెస్టు చేశారో తనకు తెలియదన్నారు బొత్స.లీకేజీ వ్యవహారంలో నారాయణ పాత్ర ఉందా లేదా అనేది నిర్ధారణ కావాల్సి ఉందన్నారు. విద్యా మంత్రి రాజీనామా చేయాలంటూ టిడిపి చేస్తున్న డిమాండ్ ను ప్రస్తావించగా అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. పదో తరగతి పేపర్ల వ్యవహారంలో ఎంత పెద్దవారున్నా కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రతిదాన్నీ రాజకీయం చేయడం టిడిపికి అలవాటే నని, అయితే తప్పు జరగలేదని వారు స్పష్టంగా చెప్పగలరా అని బొత్స ప్రశ్నించారు.

Also Read :ఏపీ సిఐడి అదుపులో నారాయణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్