Sunday, November 24, 2024
HomeTrending Newsథామస్ కప్  విజేత ఇండియా

థామస్ కప్  విజేత ఇండియా

India-The Winner: భారత బ్యాడ్మింటన్ చరిత్రలో నేడు మే 15, 2022 సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజుగా నిలిచిపోతుంది. 73 ఏళ్ళ థామస్ కప్ చరిత్రలో తొలిసారి ఇండియా జట్టు విజేతగా అవతరించింది. 1949లో ఆరంభమైన ఈ టోర్నీ మొదట్లో మూడేళ్ళకోసారి నిర్వహించేవారు, 1982 తర్వాత ప్రతి రెండేళ్లకోసారి నిర్వహిస్తున్నారు.

బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ‘టోటల్ ఇంజనీర్స్ థామస్ అండ్ ఊబెర్ కప్ ఫైనల్స్ 2022’ పేరిట బ్యాంకాక్ లో జరిగిన తాజా టోర్నమెంట్ లో నేడు జరిగిన ఫైనల్లో ఇప్పటివరకూ 14సార్లు ఈ కప్ గెల్చుకున్న ఇండోనేషియాపై 3-0 తేడాతో ఇండియా విజయం సాధించింది.

తొలి మ్యాచ్ లో (సింగిల్స్) 8-21; 21-17; 21-16 తో అంటోనీ సినిసుకా గెంటింగ్ పై గెలుపొందాడు.

రెండో మ్యాచ్ లో (డబుల్స్) సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ 18-21; 23-21; 21-19; 22-20తో మొహమ్మద్ అషాన్-కెవిన సంజయ సుకముజియో ద్వయాన్ని ఓడించారు.

మూడో మ్యాచ్ లో (సింగిల్స్)  కిడాంబి శ్రీకాంత్ 21-15;23-21తో జోనాతాన్ క్రిస్టీపై విజయం సాధించి ఇండియా బ్యాడ్మింటన్ చరిత్రను తిరగరాశారు.

మూడు వరుస మ్యాచ్ లు గెలుపొందడంతో మిగిలిన రెండు మ్యాచ్ లూ ఆడాల్సిన అవసరం లేకుండానే ఇండియా విశ్వ విజేతగా అవతరించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్