Lucknow lost: ఐపీఎల్ లో నేడు జరిగిన రెండో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై రాజస్థాన్ రాయల్స్ 24 పరుగులతో విజయం సాధించింది. ముంబై బ్రాబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టు స్కోరు 11 వద్ద ఓపెనర్, హార్డ్ హిట్టర్ జోస్ బట్లర్ కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి అవేష్ ఖాన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్-41; దేవదత్ పడిక్కల్-39; కెప్టెన్ సంజూ శామ్సన్-32…. చివర్లో రియాన్ పరాగ్-19; ట్రెండ్ బౌల్ట్-17 స్కోరుతో రాణించారు. రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 178 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు; అవేష్ ఖాన్, జేసన్ హోల్డర్, అయూష్ బదోనీ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
లక్నో 29 పరుగులకే మూడు కీలక వికెట్లు (డికాక్-7; రాహుల్-10; అయూష్ బదోనీ- డకౌట్) కోల్పోయింది. ఈ దశలో దీపక్ హుడా- క్రునాల్ పాండ్యాలు నాలుగో వికెట్ కు 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టారు. పాండ్యా-25; హుడా 39 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 59 పరుగులు చేసి ఔటయ్యారు. మార్కస్ స్టోనిస్ ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 27 పరుగులు చేసినా రన్ రేట్ఎక్కువగా ఉండడంతో ప్రయోజనం లేకుండా పోయింది. 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులు మాత్రమే చేయగలిగింది.
రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌత్ట్, ప్రసిద్ కృష్ణ, ఒబెద్ మెక్ రాయ్ తలా రెండు; యజువేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు.
బౌల్ట్ కు ‘మ్యాన్ అఫ్ దమ్యాచ్’ దక్కింది.
Also Read : ఐపీఎల్: చెన్నైకి తొమ్మిదో ఓటమి