Saturday, November 23, 2024
HomeTrending Newsదావోస్‌ చేరుకున్న సీఎం

దావోస్‌ చేరుకున్న సీఎం

CM Jagan at Davos: వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ మోహన్ రెడ్డి దావోస్  చేరుకున్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న వరల్డ్‌ఎకనామిక్‌ ఫోరం సదస్సులో ఆయన పాల్గొంటారు.

రేపటి కార్యక్రమాలు:

  • వర్డల్‌ఎకనామిక్‌ ఫోరం సదస్సు జరగనున్న కాంగ్రెస్‌ వేదికగా రేపు ఉదయం డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ క్లాజ్‌ ష్వాప్‌తో ఏపీ ఒప్పందం కుదుర్చుకోనుంది. డబ్ల్యూఈఎఫ్‌ నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడుతుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, పరిశ్రమలకు అవసరమైన నాణ్యమైన మానవనరుల తయారీ, స్థిరంగా ఉత్పత్తులు, రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా పంపిణీ వ్యవస్థలు, డేటా షేరింగ్, ఉత్పత్తులకు విలువ జోడించడం లాంటి ఆరు అంశాల్లో ఈ ఒప్పందం ద్వారా వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం రాష్ట్రానికి మార్గనిర్దేశం చేస్తుంది.
  • డబ్ల్యూఈఎఫ్‌ హెల్త్‌కేర్‌– హెల్త్‌ విభాగం అధిపతి, డాక్టర్‌ శ్యాం బిషేన్‌తోకూడా సీఎం సమావేశం అవుతారు.
  •  దీనితర్వాత మధ్యాహ్నం బీసీజీ గ్లోబల్‌ ఛైర్మన్‌ హన్స్‌ పాల్‌బర్కనర్‌తో ముఖ్యమంత్రి ఏపీ లాంజ్‌లో సమావేశం కానున్నారు.
  • సాయంత్రం డబ్ల్యూఈఎఫ్‌ కాంగ్రెస్‌ వేదికలో జరిగే వెల్‌కం రిసెప్షన్‌కు సీఎం హాజరవుతారు.

దావోస్‌ల్లో సీఎంకు స్వాగతం:
దావోస్‌లో ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో ఏపీఐఐసీ ఛైర్మన్‌ మెట్టుగోవిందరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కృష్ణగిరి, పలువురు అధికారులు ఉన్నారు. రోడ్డు మార్గంలో సీఎం దావోస్‌ చేరుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్