Saturday, September 21, 2024
HomeTrending Newsటెక్సాస్ స్కూల్ లో కాల్పులు..21 మంది మృతి

టెక్సాస్ స్కూల్ లో కాల్పులు..21 మంది మృతి

అమెరికా టెక్సాస్ లోని ఓ ఎలిమెంటరీ స్కూల్ లో 18ఏళ్ల యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 19 మంది చిన్నారులతో సహా ముగ్గురు స్కూల్ సిబ్బంది మృత్యువాత పడ్డారు. మృతి చెందిన విద్యార్థుల వయస్సు 4 నుంచి 11ఏళ్ల మధ్య ఉంటుందని అక్కడి అధికారులు తెలిపారు. మరికొందరికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన వ్యక్తిని ఇద్దరు పోలీసులు హతమార్చినట్లు టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం సమయంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. మెక్సికన్ సరిహద్దులోని ఉవాల్దేలో ఈ ఘటన చోటు చేసుకుంది.

తన సొంత వాహనంలో స్కూల్ వరకు వచ్చిన దుండగుడు తుపాకీతో స్కూల్ లోకి ప్రవేశించాడని, కాల్పులు జరిపిన సమయంలో దుండగుడి వద్ద రైఫిల్ కూడా ఉండొచ్చని టెక్సాస్ గవర్నర్ తెలిపాడు. కాల్పులు జరిపిన సమయంలో పాఠశాలలో 500 మంది విద్యార్థులు ఉన్నారు. కాల్పుల నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు పాఠశాలను తమ ఆదీనంలోకి తీసుకున్నారు. కాల్పుల సమాచారాన్ని అధ్యక్షుడు జోబైడెన్ కు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే పాఠశాలలో కాల్పుల కంటే ముందు దుండగుడు తన అమ్మమ్మను కాల్చి చంపాడని పోలీస్ అధికారుల దర్యాప్తులో తేలింది.

2018లో ప్లోరిడాలోని పార్క్ ల్యాండ్ లో జరిగిన కాల్పుల్లో 14 మంది హైస్కూల్ విద్యార్థులతో పాటు ముగ్గురు టీచర్లు మృతి చెందారు. ఈ ఘటన తర్వాత ఇదే అత్యంత దారుణ సంఘటన అని అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల టెక్సాస్‌లో బఫెలో సూపర్‌మార్కెట్ లో కాల్పులు జరిగాయి. ఆ ఘటన జరిగి పది రోజులు గడవక ముందే తాజాగా దుండగుడు స్కూల్ లోకి చొరబడి కాల్పులు జరపడం ఆందోళన కలిగిస్తోంది.

Also Read : న్యూయార్క్ సబ్ వేలో కాల్పులు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్