నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తామని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. హైదరాబాద్ అబిడ్స్‌లోని స్మైలింగ్ స్టార్స్ ప్లే స్కూల్‌ను సజ్జనార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం టీఎస్ ఆర్టీసీ నష్టాల్లో ఉందన్నారు. గతేడాది రూ. 2,200 కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు. నష్టాలను అధిగమించి లాభాల బాట పట్టించేందుకు ఆర్టీసీ యాజమాన్యం కృషి చేస్తోందన్నారు. కొవిడ్‌తో పాటు ఇంధన ధరలు పెరగడంతో ఆర్టీసీ నష్టాల్లో ఉందన్నారు. కార్గో సర్వీస్‌లను మెరుగుపరుస్తామన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు, కొత్త బస్సులు, నూతన సంస్కరణల ద్వారా రానున్న రోజుల్లో ఆర్టీసీని ప్రగతి పథంలో నడిపిస్తామన్నారు. ఇటీవల అమలు చేసిన మ్యాంగో ఎక్స్‌ప్రెస్ ద్వారా ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని సజ్జనార్ పేర్కొన్నారు.
Also Read : ఆదాయం పెంపునకు TSRTC వంద రోజుల ప్రణాళిక