పంజాబ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన నాటి నుంచి భగవంత్ మాన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా 424 మంది విఐపిలకు పోలీసు భద్రత ఉపసంహరిస్తూ ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు. మాజీ పోలీసు అధికారులు, పదవీ విరమణ చేసిన IAS,IPS అధికారులకు, రాజకీయనాయకులతో పాటు మతపెద్దలకు తాజా నిర్ణయం వర్తింప చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఏడాది మార్చి 16న పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్.. ప్రమాణ స్వీకారానికి ముందే రాష్ట్రంలోని పలువురు వీవీఐపీలతో సహా 122 మంది మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేల భద్రతను ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో మాన్ నిర్ణయం కలకలం రేపింది. ఇందులో పలువురు కాంగ్రెస్, అకాలీదళ్, బీజేపీ నేతలు ఉన్నారు. దీంతో వీరంతా గగ్గోలు పెట్టారు.
భగవంత్ మాన్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం..కేంద్ర హోంశాఖ గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు భద్రతలో ఉన్న బాదల్ కుటుంబానికి, కెప్టెన్ అమరీందర్ సింగ్, చరణ్‌జిత్ సింగ్ చన్నీ వంటి మాజీ సీఎంలకు మాత్రమే భద్రత కొనసాగించారు. వీరు మినహా మిగిలిన కాంగ్రెస్, అకాలీదళ్, ఇతర నేతలకు ఇచ్చిన భద్రతను తొలగించారు. విఐపి సంస్కృతికి చెల్లు చీటీ పలుకుతూ గత రెండు నెలలుగా సిఎం భగవంత్ మాన్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : పంజాబ్ లో మంత్రికి ఉద్వాసన