India won: ఇండోనేషియాలోని జకార్తాలో జరుగుతోన్న ఆసియా కప్ హాకీ టోర్నీ సూపర్-4 లో తొలి మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది. నేడు జరిగిన మ్యాచ్ లో జపాన్ పై 2-1 తేడాతో గెలుపొందింది.
ఆట 8వ నిమిషంలోనే ఇండియాకు మంజీత్ ఫీల్డ్ గోల్ ద్వారా స్కోరు బోణీ చేశాడు. 18 వ నిమిషంలో జపాన్ ఆటగాడు నివా తకుమా పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలిచి స్కోరు సమం చేశాడు. అయితే 35వ నిమిషంలో రాజ్ భర్ పవన్ ఫీల్డ్ గోల్ ద్వారా ఇండియా స్కోరును 2-1గా ఆధిక్యంలోకి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత జపాన్ ను అడ్డుకోవడంలో ఇండియా ఆటగాళ్ళు సఫలీకృతం కావడంతో విజయం దక్కింది. మంజీత్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది. రేపు 29న మలేషియా, 31న సౌత్ కొరియాతో ఇండియా తలపడనుంది.