Gabon : ఆఫ్రికాతో సంబంధాలు భారత్ కు ప్రదానమైనవని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. గబాన్ రాజధాని లిబ్రేవిల్లెలో ఉపరాష్ట్రపతి భారతీయ సంతతి వారితో సమావేశమయ్యారు. గబాన్ లో భారతీయ కుటుంబాలు కేవలం ఐదు వందలతో వెయ్యి నుంచి పదిహేను వందల ఇండియన్స్ వరకు ఉన్నా దేశాభివ్రుద్దిలో వారి పాత్ర ప్రశంసనీయమైనదని ఉపరాష్ట్రపతి కొనియాడారు. మైనింగ్, పర్యాటకం, ఫార్మా రంగాల్లో భారతీయులు పెట్టుబడులు పెడుతున్నారని మరిన్ని రంగాలకు విస్తరించేందుకు గబాన్ లో అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా ప్రవాస భారతీయులు వెల్లడించారు.
మూడు దేశాల పర్యటనలో భాగంగా వెంకయ్య నాయుడు గబాన్ రిపబ్లిక్ రాజధాని లిబ్రేవిల్లా లో ప్రధాని రోజ్ క్రిస్టైనా ఒసుకా రాపోండా, ఆ దేశా విదేశాంగ మంత్రి మైకెల్ మౌసా ఆడమో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు అలీ బొంగో ఒండిమాతో వెంకయ్య నాయుడు సమావేశం అయ్యారు. గబాన్ ప్రధానితో అత్యున్నత స్థాయి అధికారిక చర్చల్లో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. గబాన్ అభివృద్ధి పథంలో భారత్ ప్రభుత్వం విశ్వసనీయమైన భాగస్వామిగా ఉంటుందని ఉపరాష్ట్రపతి భరోసా కల్పించారు. ఫార్మాసూటికల్స్, ఎనర్జీ, వ్యవసాయం, వరి, రక్షణ, భద్రత, ఆయిల్ అండ్ గ్యాస్, సౌరశక్తి తదితర అంశాల్లో వాణిజ్యం మరంతగా పెరిగేందుకు అవకాశం ఉందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. గబాన్ తో పాటు ఆఫ్రికా దేశాలతో సత్సంబంధాలకు భారతదేశం ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. గబాన్ అభివృద్ధి పథంలో భారత ప్రభుత్వం విశ్వసనీయమైన భాగస్వామిగా ఉంటుందని ఆయన భరోసా కల్పించారు. కరోనా నేపథ్యంలో 2021-22 సంవత్సరానికి గానూ భారత్, గబాన్ ద్వైపాక్షిక వాణిజ్యం బలియన్ డాలర్లు దాటడాన్ని ప్రస్తావిస్తూ ఈ దిశగా మరింత పురోగతి సాధించేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయన్నారు. ఫార్మాసూటికల్స్, ఎనర్జీ, వ్యవసాయం, వరి, రక్షణ, భద్రత, ఆయిల్ అండ్ గ్యాస్, సౌరశక్తి తదితర అంశాల్లో వాణిజ్యం మరింతగా పెరిగేందుకు అవకాశం ఉందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
గబాన్ తో భారత్ కు ఉన్న సత్సంబంధాలను ప్రస్తావిస్తూ.. 20 మంది గబనీస్ దౌత్యవేత్తలకు ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చేందుకు భారతదేశం అంగీకరించిన విషయాన్ని గుర్తుచేశారు . 2022-23 సంవత్సరానికి గానూ ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికైనందుకు గబాన్ ను అభినందించిన ఉపరాష్ట్రపతి, భారతదేశానికి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించే విషయంలో గబాన్ మద్దతుగా నిలిచిన విషయాన్ని గుర్తుచేస్తూ ధన్యవాదములు తెలిపారు. ఉగ్రవాదం, వాతావరణ మార్పులు తదితర అంశాల్లోనూ పరస్పర సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు.
Also Read : సింధు జలాలపై భారత్ పాక్ చర్చలు