Sunday, January 19, 2025
Homeసినిమా'విక్రమ్'లో ఇదే ఇంట్రెస్టింగ్ పాయింట్! 

‘విక్రమ్’లో ఇదే ఇంట్రెస్టింగ్ పాయింట్! 

The Point is: ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ ‘విక్రమ్‘ సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం కమల్ లుక్ .. భారీ తారాగణం .. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ నుంచి ఈ సినిమా వస్తుండటం. కమల్ హాసన్ కి ప్రయోగాలు కొత్తకాదు. కానీ ఆయన సొంత బ్యానర్లో సినిమాలో రాక చాలా కాలమైంది . అలాగే ఆయనకి తగిన హిట్ పడక కూడా చాలా కాలమైంది. ఈ నేపథ్యంలోనే ఇంతకుముందు మూడే సినిమాలు చేసిన లోకేశ్ కనగరాజ్ ను పిలిచి మరీ ఆయన అవకాశం ఇచ్చారు. అలా విక్రమ్’ సినిమా పట్టాలెక్కింది.

ఈ సినిమాలో విజయ్ సేతుపతి .. ఫహాద్ ఫాజిల్ .. నరేన్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఇక ప్రత్యేకమైన  పాత్రను సూర్య పోషించాడు. అందరూ స్టార్స్ కావడంతో  .. ఈ సినిమాలో ఎవరి పాత్ర ఎలా ఉండనుంది? అనే ఆసక్తి ఆ అందరిలో మొదలైంది. అసలు ఈ సినిమాలో కమల్ లుక్ .. ఆయన ప్రవర్తన కాస్త భిన్నంగా అనిపిస్తాయి. ఇక మిగతా ఆర్టిస్టుల లుక్ .. వాళ్ల స్వభావం కూడా డిఫరెంట్ గా అనిపిస్తోంది. దాంతో అసలు ఈ కథ ఏమిటి? ఎక్కడ మొదలై  ఎటువైపు వెళుతుంది? అనే ఉత్కంఠ అందరిలో మొదలైంది.

తాజా ఇంటర్వ్యూలో కమల్ మాట్లాడుతూ .. ” ప్రతి మనిషిలో మరో మనిషి ఉంటాడు. లోపల ఉన్న ఆ అసలు మనిషి  ఎలాంటి పరిస్థితుల్లో బయటికి వస్తాడు? అలా వస్తే ఏం జరుగుతుంది? అనేదే కథ అని చెప్పారు. నిజంగానే ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. మరి లోకేశ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందనేది చూడాలి. స్క్రీన్ ప్లే విషయంలో  లోకేశ్ సత్తా ఏంటనేది ‘ఖైదీ’ నిరూపించింది. మరి ఈ సినిమా విషయంలో లోకేశ్ ఎలాంటి మేజిక్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఇక రేపు కమల్ విశ్వరూపం మరోసారి చూడటానికి ఆయన అభిమానులంతా రెడీయైపోయారు.

Also Read : కమల్ హాసన్ ‘విక్రమ్’ హక్కులు సొంతం చేసుకున్న నితిన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్