Saturday, November 23, 2024
HomeTrending Newsతల తెగి పడ్డా వెనుకడుగు వేయను - రేవంత్ రెడ్డి

తల తెగి పడ్డా వెనుకడుగు వేయను – రేవంత్ రెడ్డి

Revanth Reddy : తల తెగి పడ్డా వెనకడుగు వెయ్యనని, కాంగ్రెస్ తో కపిసి రండి.. అవినీతి కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేద్దామని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ కు విముక్తి కలిగిద్దామని అమెరికాలోని తెలంగాణ వాసులకు రేవంత్ పిలుపు ఇచ్చారు. అమెరికాలోని డల్లాస్ నగరంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రేవంత్ రెడ్డి, ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎక్కడో మారుమూల పల్లెల్లో పుట్టి అమెరికాలో ఎంతగానో ఎదిగిన మిమ్మల్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు.

అమెరికా అభివృద్ధిలో తెలంగాణ ప్రజల భాగస్వామ్యం ఉండడం గర్వంగా ఉందని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం టి.డి. ఎఫ్ ఏర్పాటు చేసి  తెలంగాణ కోసం ఎంతో కష్టపడ్డారని రేవంత్ రెడ్డి అభినందించారు. తెలంగాణ కోసం ఎంతో మంది యువకులు, విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేశారని, వారి త్యాగం, సోనియమ్మ దీవెన వల్ల తెలంగాణ వచ్చిందన్నారు. ఎన్నో పార్టీలను ఒప్పించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని, ప్రత్యేక  రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మకు తెలంగాణలో అధికారంలోకి తెచ్చి బహుమతి ఇవ్వాలన్నారు.

తెలంగాణ ఏ లక్ష్యం కోసమైతే తెచుకున్నామో ఇప్పుడు ఆ లక్ష్యం నెరవేరడం లేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మేము మిమ్మల్ని ఇక్కడ పార్టీ చందాలు అడగడనికో, ఓట్ల కోసమో కలవడానికి రాలేదని స్పష్టం చేశారు. తెలంగాణ తెచ్చుకున్న మనం తెలంగాణ లక్ష్యాలు సాధిస్తునామా అని కూడా పరిశీలించాలని కోరారు. తెలంగాణలో పరిస్థితులు బాగా లేవు.. కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయ్యిందని, కేసీఆర్, కొడుకు, అల్లుడు, బిడ్డ, సడ్డకుడి కొడుకు, బంధువులు, చుట్టాలు వేల కోట్ల రూపాయలు సంపాదించి తెలంగాణ ను బందీ చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

తెలంగాణ ప్రజలకు అప్పులు, ఆత్మహత్యలు మిగిలాయి. ఉద్యోగాలు లేవు.. సకాలంలో జీతాలు లేవు.. ముసలోళ్ళకు పెన్షన్లు లేవని రేవంత్ రెడ్డి చెప్పారు. 60 ఏళ్ళు తెలంగాణలో అన్ని వనరులు అభివృద్ధి చేస్తే కేసీఆర్ కుటుంబం అన్నింటినీ దోచుకున్నదన్నారు. కేసీఆర్ కుటుంబం బందీఖానా నుంచి తెలంగాణను విడిపించాలని, నన్ను చర్లపల్లి జైలులో వేశామని అంటున్నారు. కేసీఆర్ అవినీతిని నిరూపించి శాశ్వతంగా కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేద్దామని రేవంత్ అన్నారు. ఖమ్మం జిల్లాలో నిరుద్యోగ యువకుడు ఉద్యోగం లేదని రైల్ కు గుద్దుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అలాంటి సంఘటనలు తెలంగాణ లో రోజు అవుతున్నాయి. తెలంగాణలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయన్నారు.

ఆత్మ గౌరవం, స్వయం పాలన సామాజిక న్యాయం కోసం తెలంగాణ తెచుకున్నామని, బానిస బతుకు నుంచి విముక్తి కోసం కొట్లాడుదామని రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు. తల తెగి పడ్డ వెనుకడుగు వేసేది లేదని, కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణ కు విముక్తి కలిగిద్దామని ప్రవాస తెలంగాణ వాసులను రేవంత్ కోరారు. రాబోయే ఎన్నికలలో మీరు మీ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవండి.. కేసీఆర్ నుంచి తెలంగాణ కు విముక్తి కలిగించి తెలంగాణ కు మంచి రోజులు తెచ్చే బాధ్యత మాదని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.

Also Read : మరోసారి రేవంత్ రెడ్డి గృహనిర్భందం

RELATED ARTICLES

Most Popular

న్యూస్